సౌత్ ఇండియా జనాభా తగ్గుదలపై కీలక వ్యాఖ్యలు | Cm Chandrababu About Population | RTV
సౌత్ ఇండియాలో జనాభా తగ్గుదలపై ఏపీ సీఎం కీలక వ్యాఖ్యలు చేశారు. దంపతులు ఇద్దరి కంటే ఎక్కువ మంది పిల్లలను కనాలంటూ పిలుపునిచ్చారు. ఏపీలో ఎక్కువ మంది పిల్లలున్నవారికే ఎన్నికల్లో ప్రోత్సాహం అందించాలని తమ ప్రభుత్వం యోచిస్తున్నట్లు చెప్పారు.
దక్షిణ భారతదేశంలో వరి అన్నం లేకుండా భోజనం ఊహించడమే కష్టం. అయితే వరి అన్నం తినడం వలన చక్కెర వ్యాధికి గురయ్యే ప్రమాదం ఉందని 21 దేశాలలో పరిశోధకులు 10 ఏళ్ల పాటు 1,30,000 మందిపై చేసిన అధ్యయనంలో తేల్చారు.
దక్షిణాదికి నీటి కొరత ముప్పు పొంచి ఉందని నిపుణులు చెబుతున్నారు. సెంట్రల్ వాటర్ కమిషన్ అంటే CWC డేటా ప్రకారం దేశంలోని ప్రధాన రిజర్వాయర్లలో 4 ఎండిపోయాయి. వాటిలో 3 దక్షిణాది రాష్ట్రాల్లోనే ఉన్నాయి. దక్షిణ భారతదేశంలోని రిజర్వాయర్లలో నీటి మట్టం 23 శాతానికి తగ్గింది.
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్లో సౌత్ ఇండియాకు అన్యాయం జరుగుతోందని కాంగ్రెస్ ఎంపీ డీకే సురేష్ అన్నారు. దక్షిణ భారత్కు రావాల్సిన నిధులు ఉత్తరానికి వెళ్తున్నాయని ఆరోపించారు. ఇది ఇలానే కొనసాగితే ప్రత్యేక సౌత్ ఇండియా డిమాండ్ ముందుకొస్తుందని అన్నారు.