National: సౌత్ ఇండియన్స్ తమ కంపెనీలో ఉద్యోగం చేయడానికి అర్హులు కాదంటూ నార్త్ ఇండియాకు చెందిన ఓ కంపెనీ నోటిఫికేషన్‌లో పేర్కొనడం తీవ్ర చర్చనీయాంశమైంది. దక్షిణ భారతీయుల్లో చాలామందికి హిందీ మాట్లాడటం సరిగా తెలియదని, కనీస ఉద్యోగార్హతలు కూడా లేవంటూ కించపరిచేలా ఉద్యోగ ప్రకటన రిలీజ్ చేయడం పెద్దఎత్తున విమర్శలకు దారితీసింది. ఈ మేరకు జాబ్ పోర్టల్ 'లింక్డ్ ఇన్'లో నోయిడాకు చెందిన ఒక కన్సల్టెన్సీ కంపెనీ ఈ వివాదాస్పద ప్రకటన చేయడం తీవ్ర దుమారం రేపుతోంది. ప్రైవేట్ ఉద్యోగాల్లోనూ ప్రాంతీయ వివక్షలు చూపడంపై పలువురు మండిపడుతుండగా ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. నోయిడాలోని కన్సల్టెన్సీ కంపెనీ డేటా అనలిస్ట్ ఉద్యోగం కోసం ప్రకటన రిలీజ్ చేసింది. ఇందులో అభ్యర్థులకు ఉండాల్సిన అర్హతలు పేర్కొంటు ఇలా రాసింది. Job Posting In Noida Says "South Indian Candidates Not Eligible", Sparks Outragehttps://t.co/DXD4UcntSa pic.twitter.com/QTMHX5h5lg — NDTV (@ndtv) December 17, 2024 అర్హతలు.. - సంబంధిత విభాగంలో 4 ఏళ్ల అనుభవం తప్పనిసరి.- క్రాస్ ఫంక్షనల్ టీమ్స్, స్టేక్ హోల్డర్స్‌తో కలిసి పనిచేసే అటిట్యూడ్ ఉండాలి.- - నైస్-టు-హేవ్: వెల్లీ క్లిప్‌లు, పవర్ BI, ఎజైల్ మెథడాలజీలు లేదా డేటా వేర్‌హౌసింగ్ టూల్స్ గురించిన పరిజ్ఞానం ఉండాలి.- డేటా సొలుష్యన్స్ హై క్వాలిటీలో డెలివర్ చేసే సామర్థ్యం ఉండాలి. అని రాసుకొచ్చారు. అయితే ఇక్కడివరకు బాగానే ఉన్నా.. - సౌత్ ఇండియన్స్ ఈ ఉద్యోగానికి అప్లై చేయడానికి అర్హులు కాదు. అంటూ చివరల్లో మెన్సన్ చేయడం వివాదాస్పదమైంది. హిందీ రాదనే సాకుతో.. ఇక దీనిపై స్పందిస్తున్న సౌత్ ఇండియన్స్ భారీ స్థాయిలో విరుచుకుపడుతున్నారు. సదరు కంపెనీ పోస్ట్ చాలా వివక్ష పూరితంగా ఉందని మండిపడుతున్నారు. 'ప్రవేట్ ఉద్యోగాల్లోనూ ప్రాంతీయ వివక్ష చూపడం దారుణమని, చాలా అసహ్యకరమైనదిగా పేర్కొంటూ పోస్టులు పెడుతున్నారు. మరికొందరు మాత్రం.. 'సౌత్ ఇండియన్స్‌కు హిందీ మాట్లాడడం రాదనే సాకుతో ఉద్యోగ అర్హత లేదని చెబుతున్నారు. బహుశా ఆ ఉద్యోగంలో హిందీలో మాట్లాడడం, రాయడం తెలిసి ఉండాలేమో' అంటూ సమర్ధించే ప్రయత్నం చేస్తున్నారు. ఇంకొందరు 'సౌత్ లోనూ హిందీ అనర్గలంగా మాట్లాడి, రాసేవారు ఉన్నారు. నార్త్ లో లక్షల సంఖ్యలో ఉద్యోగాలు చేస్తున్నారు. ఈ విషయం గమనించండి' అంటూ తమ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. దక్షిణాది ప్రజలపై బలవంతంగా హిందీ రుద్దడమేనని మరికొందరు ఘాటు వ్యాఖ్యలు చేస్తున్నారు. South Indians are not allowed to apply for a job! pic.twitter.com/hTYVKkGPbs — kannada yapper (@gotttillaa) December 13, 2024