Simhachalam Incident : పునాది లేకుండా గోడ.. సింహాచలం ఘటనపై త్రిమెన్ కమిషన్ సంచలన రిపోర్ట్!
సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి చందనోత్సవం సందర్భంగా గోడకూలి ఏడుగురు చనిపోయిన ఘటన పై సంచలన విషయాలు వెలుగు చూశాయి. ఈ దుర్ఘటనపై త్రిమెన్ కమిషన్ ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది. తాత్కాలికంగా నిర్మించిన గోడకు పునాది కూడా లేదని కమిషన్ వెల్లడించింది.