BIG BREAKING : సింహాచల ఘటన.. ఏడుగురు సస్పెండ్

సింహాచల ఘటనపై ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. విచారణ కమిటి ఆధారంగా ఏడు అధికారులపై సస్పెషన్ వేటు వేసింది. దేవాదాయ, పర్యాటక శాఖలకు చెందిన ఏడుగురు అధికారులపై  సస్పెషన్ వేటు పడింది.

New Update
simhachala incident

simhachala incident

సింహాచల ఘటనపై ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది.  త్రిమెన్ విచారణ కమిటి ఆధారంగా ఏడు అధికారులపై సస్పెషన్ వేటు వేసింది. దేవాదాయ, పర్యాటక శాఖలకు చెందిన ఏడుగురు అధికారులపై  సస్పెషన్ వేటు పడింది.  సింహాచల దేవస్థానం డిప్యూటీ ఈఈ మూర్తి, జేఈ బాబ్జీ,  ఏపీటీడీసీ ఈఈ రమణ, డిప్యూటీ ఈఈ స్వామి, ఏఈ మదన్ మోహన్ లను సస్పె్ండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. కాంట్రక్టర్  కే లక్ష్మినారయణను బ్లాక్ లిస్టులో పెట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. కాంట్రక్టర్ తో సహా ఇద్దరు అధికారులపై క్రిమినల్ చర్యలకు ఆదేశించింది. 

నివేదికలో సంచలన విషయాలు

సీఎం చంద్రబాబుకు ఇచ్చిన ప్రాథమిక నివేదికలో సంచలన విషయాలు వెలుగు చూశాయి. తాత్కాలికంగా నిర్మించిన గోడకు పునాది కూడా లేదని ప్రాథమిక నివేదికలో కమిషన్‌ వెల్లడించింది. భారీ వర్షం కారణంగా పెద్ద ఎత్తున నీరు, బురద చేరి బరువు కారణంగా గోడ కూలినట్టు కమిషన్‌ అభిప్రాయపడింది.

కాగా గత బుధవారం (ఏప్రిల్ 30 తేదీ) తెల్లవారుజామున భారీ వర్షానికి గోడ కూలడంతో ఏడుగురు చనిపోయారు. ఈ ఘటన పై ప్రభుత్వం మున్సిపల్ పరిపాలనశాఖ ముఖ్య కార్యదర్శి ఎస్‌.సురేష్‌ కుమార్‌ అధ్యక్షతన, ఈగల్‌ విభాగాధిపతి ఐజీ ఆకే రవికృష్ణ, జలవనరులశాఖ ఇంజినీర్‌ ఇన్‌ చీఫ్‌ ఎం.వెంకటేశ్వరరావు సభ్యులుగా కమిషన్‌ను ఏర్పాటు చేసింది.ప్రమాదంపై 72 గంటల్లో నివేదిక ఇవ్వాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు. దీంతో వారు నివేదిక అందజేశారు.

పునాదులు లేకుండా నిర్మించిన గోడ దిగువకు నీరు వెళ్లేందుకు లీప్ హోల్స్ కూడా లేవని కమిషన తన  ప్రాథమిక నివేదికలో పేర్కోంది. చందనోత్సవానికి వారం రోజుల ముందు ఈ గోడను హడావిడిగా నిర్మించినట్టు స్పష్టం చేసింది. ప్రసాద్ స్కీమ్ లో భాగంగా గోడ నిర్మాణానికి హడావిడిగా అనుమతులిచ్చారని కమిషన్‌ పేర్కొంది.గోడ నిర్మాణానికి ఎలాంటి డిజైన్లు లేక పోగా పునాది కూడా లేకుండా నిర్మించేశారని ప్రాథమిక నివేదికలో కమిషన్‌ పేర్కొంది. గోడ పటిష్టత గురించి గానీ, భక్తుల భద్రత గురించిగానీ ఎలాంటి తనిఖీలు చేయలేదని కమిషన్‌ తెలిపింది.

Also read : TGSRTC : ఆర్టీసీ సమ్మె... ఉద్యోగులను బెదిరిస్తే..అంతే సంగతులు సిబ్బందికి యాజమాన్యం బహిరంగ లేఖ...

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు