ఎంతకు తెగించార్రా, సినిమా తరహా దొంగతనం.. అమెజాన్ కే రూ.కోట్లలో కన్నం!
రాజస్థాన్ కు చెందిన రాజ్ కుమార్, సుభాష్ అమెజాన్ కు రూ. కోటికి పైగా దెబ్బేశారు. ఆన్ లైన్ లో హై అండ్ లో కాస్ట్ వస్తువులు ఆర్డర్ చేసి.. ఎక్కువ ధర స్టిక్కర్ ను తక్కువ ధరకు పెట్టేవారు. తర్వాత ఎక్కువ ధర వస్తువు రిటర్న్ పెట్టి డబ్బులు దోచేశారు.
Hyderabad: డబుల్ బెడ్ రూం ఇళ్లు ఇప్పిస్తానని లక్షలు కొట్టేశాడు, తీరా చూస్తే!
కూకట్ పల్లి హౌసింగ్ బోర్డు కాలనీకి చెందిన వేణుగోపాల్ దాస్.. డబుల్ బెడ్ రూం ఇళ్లు ఇప్పిస్తానని విడతల వారీగా డబ్బులు కట్టించుకున్నాడు. నకిలీ తాళాలు, డాంక్యుమెంట్లు వారికి ఇచ్చాడు. తీరా వారు ప్లాట్ల వద్దకు వెళ్లి చూడగా వేరే వారు ఉండటంతో షాక్ అయ్యారు.
కొడుకుని మింగిన ఆన్ లైన్ బెట్టింగ్.. దారుణానికి పాల్పడ్డ తల్లి!
రంగారెడ్డి జిల్లాకి చెందిన అఖిల్‌రెడ్డి ఆన్లైన్ ట్రేడింగ్ లో రూ.20 లక్షలు నష్టపోయాడు. దీంతో అప్పుల బాధ తట్టుకోలేక ఉరేసుకుని చనిపోయాడు. కుమారుడి మరణంతో తల్లి లూర్దమ్మ ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు.
ఐసీఐసీఐ బ్యాంక్‌లో భారీ కుంభకోణం
పల్నాడు జిల్లా చిలకలూరిపేటలో ఐసీఐసీఐ బ్యాంక్‌లో భారీ కుంభకోణం జరిగింది. గతంలో మేనేజర్‌గా పనిచేసిన నరేశ్, గోల్డ్ అప్రైజర్‌గా హరీశ్ ఫిక్సిడ్ డిపాజిట్లు, బంగారం రుణాల నుంచి కోట్ల నగదు అకౌంట్లలో బదిలీ చేసుకున్న ఘటన ఇటీవల వెలుగులోకి వచ్చింది.
Fake PhonePe: ఫేక్ ఫోన్ పే యాప్‌తో మోసానికి పాల్పడుతున్న కేటుగాళ్లు..
ఏలూరు జిల్లాలో ఓ వ్యక్తి మొబైల్ షాపులో ఫోన్ కొని నగదును ఫోన్ పే యాప్ ద్వారా చెల్లించాడు. డబ్బులు చెల్లించినట్లు అతడి ఫోన్లో కనపించింది. కానీ ఓనర్ ఖాతాలోకి రాలేవు. అనుమానం వచ్చిన ఓనర్ ఆ వ్యక్తి నకిలీ ఫోన్ పే యాప్ ద్వారా నగదు చెల్లించినట్లు ఓనర్ గుర్తించాడు.
Facebook Fraud: ఫేస్బుక్ స్నేహం.. వృద్ధ మహిళ నుండి 80 లక్షలు స్వాహా
68 ఏళ్ళ మహిళకి ఫేస్బుక్ లో రిక్వెస్ట్ పెట్టిన మోసగాడు ఆమెకు 80 బ్రిటిష్ పౌండ్లు గిఫ్ట్ గా పంపుతున్నట్టు నమ్మించి. తీరా ఆ గిఫ్ట్ పార్సెల్ పొందాలి అంటే డబ్బు చెల్లించాలి అంటూ మహిళ వద్ద నుండి రూ.8.15 లక్షలు దోచుకున్నాడు. ఈ ఘటన ముంబైలో వెలుగు చూసింది.