Samantha : ఆమె నాకు ఆదర్శం.. ఇంటర్ విద్యార్థినిపై సమంత ప్రశంసలు!
నటి సమంత నెట్టింట ఇంట్రెస్టింగ్ పోస్ట్ షేర్ చేసింది. బాల్య వివాహాన్ని ఎదిరించి ఇంటర్ ఫస్టియర్లో 421 మార్కులు సాధించి టాపర్గా నిలిచిన కర్నూలు జిల్లాకు చెందిన నిర్మల తనకు ఆదర్శమంటూ పొగిడేసింది. ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్ అవుతుండగా నెటిజన్లు ఫిదా అవుతున్నారు.