Movies: హాట్ టాపిక్‌గా సమంత రెమ్యునరేషన్ టాలీవుడ్ స్టర్ హీరోయిన్ ఏడాదిగా మూవీస్ చేయడం లేదు. అయినా కూడా తన సోషల్ మీడియా పోస్ట్‌ల ద్వారా లైమ్ లైట్లో ఉంటూనే వచ్చింది. ఇప్పుడు సీటా డెల్ వెబ్ సీరీస్ ద్వారా మరోసారి హాట్ టాపిక్‌గా మారింది సమంత. ఆ సీరీస్ కోసం తను తీసుకున్న రెమ్యునరేషన్ గురించి ఇప్పుడు పెద్ద చర్చే జరుగుతోంది. By Manogna alamuru 08 Aug 2024 in సినిమా టాప్ స్టోరీస్ New Update షేర్ చేయండి Samantha remunaration: సమంత ఏడాది సినిమాలకు గ్యాప్ ఇచ్చి తన హెల్త్ మీద ఫోకస్ చేసిన సంగతి తెలిసిందే. మళ్ళీ ఇప్పుడిప్పుడే వరుసగా సినిమాలు, సిరీస్ లు ఓకే చేస్తుంది. సమంత నటించిన సిటాడెల్ వెబ్ సిరీస్ అమెజాన్ ఓటీటీలో నవంబర్ 7 నుంచి స్ట్రీమింగ్ కాబోతుంది. ఈ సిరీస్ తో సమంత మళ్ళీ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇప్పటికే ఈ సిరీస్ టీజర్ రిలీజవ్వగా ఇందులో సమంత యాక్షన్ సన్నివేశాలతో అదరగొట్టింది.అయితే ఈ సిరీస్ కి సమంత తీసుకున్న రెమ్యునరేషన్ ఇప్పుడు చర్చగా మారింది. సాధారణంగా బాలీవుడ్ లో హీరోయిన్స్ కి కూడా రెమ్యునరేషన్ ఎక్కువే ఇస్తారని తెలిసిందే. అయితే సమంత సిటాడెల్ సిరీస్ కి గాను ఏకంగా 10 కోట్ల రెమ్యునరేషన్ అందుకుందని బాలీవుడ్ సమాచారం. బాలీవుడ్ లో ఇంత రెమ్యునరేషన్ అందుకున్న ఫస్ట్ సౌత్ హీరోయిన్ కూడా సమంతనే అని అంటున్నారు. సాధారణంగా సమంత రెండు నుంచి మూడు కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటుంది. సౌత్ లో గరిష్టంగా నయనతార 5 నుంచి 8 కోట్ల వరకు రెమ్యునరేషన్ తీసుకుంటుంది. నయనతార జవాన్ సినిమాకు బాలీవుడ్ లో 8 నుంచి 10 కోట్ల మధ్య రెమ్యునరేషన్ తీసుకుందని సమాచారం. ఇప్పుడు సమంత సిటాడెల్ కు 10 కోట్లు తీసుకుంది. దీంతో నయనతార, సమంతలో ఎవరు ఎక్కువ తీసుకున్నారు అని చర్చగా మారింది. అలాగే వీరిద్దరిలో బాలీవుడ్ లో ఎక్కువ రెమ్యునరేషన్ తీసుకున్న ఫస్ట్ సౌత్ హీరోయిన్ ఎవరు అని కూడా ఫ్యాన్స్ లో చర్చ జరుగుతోంది. Also Read: Telangana: ఆగస్టు 15న సీతారామ ప్రాజెక్టు ప్రారంభం #citadel #movies #samantha #remunaration మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి