Saddula Bathukamma: కేసీఆర్ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు.. తెలంగాణ నిండైన బతుకమ్మను తలపిస్తోందన్న సీఎం
నేడు సద్దుల బతుకమ్మ సందర్భంగా సీఎం కేసీఆర్ రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ రాష్ట్రం నేడు పచ్చదనం, పాడి పంటలు, పశుసంపద, ప్రకృతి వనరులతో నిండైన బతుకమ్మను తలపిస్తోందని ఈ సందర్భంగా సీఎం అన్నారు. బతుకమ్మలను నిమజ్జనం చేసే సమయంలో స్వీయ జాగ్రత్తలతో పాటు, ప్రభుత్వ మార్గదర్శకాలను పాటించాలని సూచించారు.