Telangana:ప్రజా భవన్ గా మారిన ప్రగతి భవన్..మరి కాసేపట్లో ప్రజాదర్బార్
ప్రగతి భవన్...ప్రజా భవన్ అయింది. ఇక మీదట ఇది అన్ని రోజులూ ప్రజలకు అందుబాటులో ఉండనుంది. ఇవాళ పదిగంటలకు జ్యోతిరావు పూలే భవన్ లో ప్రజా దర్బార్ నిర్వహించనున్నారు సీఎం రేవంత్ రెడ్డి.
ప్రగతి భవన్...ప్రజా భవన్ అయింది. ఇక మీదట ఇది అన్ని రోజులూ ప్రజలకు అందుబాటులో ఉండనుంది. ఇవాళ పదిగంటలకు జ్యోతిరావు పూలే భవన్ లో ప్రజా దర్బార్ నిర్వహించనున్నారు సీఎం రేవంత్ రెడ్డి.
తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ కరెంట్ కోతలపై ఆరోపణలను బీఆర్ఎస్ విస్తృతంగా ప్రచారం చేసింది. దీంతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ కరెంట్ పై దృష్టి పెట్టింది. నేడు ఉదయం విద్యుత్ శాఖ సీఎండీలతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశం కానున్నారు.
2014 నుంచి డిసెంబర్ 7, 2023 వరకు తెలంగాణ ఫైనాన్స్‌కు సంబంధించి అన్నీ వివరాలతో కూడిన లెక్కలు చెప్పాలని కాంగ్రెస్ మంత్రులు అధికారులను ఆదేశించారు. శ్వేతపత్రం విడుదల చేయాలని నిర్ణయించుకున్నారు. కేసీఆర్ టార్గెట్‌గానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది.
ఆరు గ్యారంటీలపై కేబినెట్ భేటీలో చర్చించామన్నారు మంత్రి శ్రీధర్‌బాబు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ప్రజలకు తెలియాలన్నారు. సోనియా జన్మదినం సందర్భంగా రెండు గ్యారెంటీలు అమలు చేస్తామని శ్రీధర్‌బాబు చెప్పారు. డిసెంబర్ 9 నుంచి ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం అని తెలిపారు.
సచివాలయంలో రేవంత్‌రెడ్డి తొలి కేబినెట్ భేటీ ముగిసింది. ఈ సమావేశానికి ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కతోపాటు 11 మంది మంత్రులు హాజరయ్యారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, ఇతర ఉన్నతాధికారులు తీసుకొచ్చిన కొన్ని ఫైళ్లపై రేవంత్ సంతకం చేశారు.
తెలంగాణ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన రేవంత్‌రెడ్డికి జగన్, చంద్రబాబు, పవన్ విషెస్ చెప్పారు. రెండు తెలుగు రాష్ట్రాల మధ్య సోదరభావం, సహకారం పరిఢవిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాననని జగన్ ట్వీట్ చేశారు. ప్రజాసేవలో విజయం సాధించాలని కోరుకుంటున్నానని చంద్రబాబు ట్వీట్ చేశారు.
తెలంగాణ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత రేవంత్ రెడ్డి చేసిన తొలి ట్వీట్ వైరల్‌గా మారింది. 'బానిసత్వపు సంకెళ్లు బద్దలయ్యాయి.. ఇక తెలంగాణ స్వేచ్ఛగా ఊపిరి పీల్చుకుంటుంది..' అని ట్వీట్ చేశారు. హక్కుల రెక్కలు విచ్చుకుంటాయిని చెప్పారు.
తెలంగాణ ప్రగతికి తన సంపూర్ణ సహకారం అందిస్తానని ప్రధాని నరేంద్ర మోదీ ట్వీట్ చేశారు. తెలంగాణ సీఎంగా ప్రమాణం చేసిన రేవంత్‌రెడ్డిని అభినందిస్తూ మోదీ ట్వీట్ చేశారు.
తెలంగాణ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత సీఎం రేవంత్ రెడ్డి ఎల్బీ స్టేడియంలో ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. జై సోనియమ్మ అంటూ మొదలుపెట్టి తెలంగాణ ప్రజల ఆకాంక్షల అనుగుణంగా సని చేస్తూ రేవంత్ అన్నగా నిలబడతానని హామీ ఇచ్చారు.