National : గుజరాత్‌లోనూ బీజేపీని ఓడిస్తాం -రాహుల్ గాంధీ
అయోధ్యలో బీజేపీని ఓడించినట్టే గుజరాత్లో కూడా ఓడిస్తామని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అన్నారు. రాజ్‌కోట్ గేమింగ్ జోన్లో జరిగిన అగ్నిప్రమాద బాధిత కుటుంబాలను రాహుల్ గాంధీ పరామర్శించారు.
అయోధ్యలో బీజేపీని ఓడించినట్టే గుజరాత్లో కూడా ఓడిస్తామని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అన్నారు. రాజ్‌కోట్ గేమింగ్ జోన్లో జరిగిన అగ్నిప్రమాద బాధిత కుటుంబాలను రాహుల్ గాంధీ పరామర్శించారు.
రాజ్యాంగంలోని పదవ షెడ్యూల్ సవరణకు కట్టుబడి ఉన్నామని చెప్పిన కాంగ్రెస్.. ఒకవైపు ఇతర పార్టీలలో గెలిచిన వారిని కాంగ్రెస్‌లో చేర్చుకుంటూ రాజ్యాంగ స్ఫూర్తిని తుంగలో తొక్కుతోందని మాజీ మంత్రి కేటీఆర్ విమర్శించారు. పార్టీ మారిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను రాజీనామా చేయించాలన్నారు.
TG: సీఎం రేవంత్‌పై ఆషాడ మాసం ఎఫెక్ట్ పడింది. మంత్రివర్గ విస్తరణ, పీసీసీ అధ్యక్షుడి ఎంపిక వాయిదా పడింది. మంచి రోజులు లేకపోవడంతో కేబినెట్ విస్తరణ వాయిదా పడినట్లు సమాచారం. కాగా శ్రావణమాసంలోనే పదవుల భర్తీ ఉండనున్నట్లు తెలుస్తోంది.
ప్రధాని మోదీకి రాహుల్ గాంధీ లేఖ రాశారు. నీట్‌పై పార్లమెంట్లో చర్చ చేపట్టాలని డిమాండ్ చేశారు. 24 లక్షల మంది నీట్ అభ్యర్థులకు ప్రధాని మోదీ జవాబు చెప్పాలని అన్నారు. నీట్‌పై చర్చను ప్రధాని మోదీనే నడిపించాలని అన్నారు.
లోక్‌సభ సమావేశాల్లో ఈరోజు ప్రధాని మోదీ మాట్లాడుతున్నారు. ప్రధాని మోదీ ప్రసంగానికి విపక్షాలు అడ్డుపడ్డాయి. మణిపూర్ అంశం గురించి మాట్లాడాలంటూ డిమాండ్ చేశాయి. దీంతో విపక్షాల తీరుపై ప్రధాని అసంతృప్తి వ్యక్తం చేశారు.
రాహుల్ గాంధీ నిన్న పార్లమెంట్ లో శివుడి విగ్రహాన్ని ప్రదర్శిస్తూ ఇచ్చిన స్పీచ్ పై బీజేపీ నేతలతో పాటు పలువురు మత పెద్దలు ఫైర్ అవుతున్నారు. రాహుల్ పూర్తి వివరాలు తెలుసుకుని మాట్లాడితే బాగుండేదన్నారు. ఇప్పటికైనా ఆయన తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.
పార్లమెంటులో రాహుల్ గాంధీ వైఖరిపై కేంద్రమంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ ఫైర్ అయ్యారు. రాహుల్ గాంధీ హిందువుల మనోభావాలను దెబ్బ తీసారని మండిపడ్డారు. రాహుల్ హుందాతనం మరచి వ్యాఖ్యలు చేశారంటూ కేంద్ర మంత్రి వీడియో ను విడుదల చేశారు.
ప్రతిపక్షాల గొంతు నొక్కడమే లక్ష్యంగా చేసుకొని మోదీ ప్రభుత్వం వ్యవహరిస్తుందని ప్రతిపక్ష పార్టీల ఎంపీలు ఆరోపించారు. ప్రతిపక్షపార్టీలపై మోదీ ప్రభుత్వం వ్యవహారశైలికి నిరసన తెలుపుతూ పార్లమెంట్ ప్రాంగణంలో ఇండియా కూటమికి చెందిన ఎంపీలు ఆందోళనకు దిగారు.
బిజెపి హిందువులు హింసాత్మకులు వారు నిజమైన హిందువులు కాదు'' అని లోక్ సభలో ప్రసంగించిన రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మాలా సీతారామన్ ఖండించారు. తనను తాను హిందువుగా చెప్పుకునే రాహుల్ హిందువుల మనోభావాలు దెబ్బతీసేలా ఉన్నాయని 'ఎక్స్' వెబ్సైట్లో పోస్ట్ చేశాడు.