AP: శ్రీ చైతన్య స్కూల్లో ర్యాగింగ్ భూతం...ఐరన్ బాక్స్ తో వాతలు

కాలేజీల్లో ర్యాగింగ్ అందరికీ తెలిసిందే. కానీ ఇప్పుడు ఆ భూతం స్కూళ్ళకు కూడా వ్యాపించింది రాజమండ్రి శ్రీ చైతన్య స్కూల్లో ఓ విద్యార్థిని ర్యాగింగ్ పేరుతో దారుణంగా హింసించారు. ఏకంగా ఐరన్ బాక్స్ తో వాతలు పెట్టారు. 

New Update
ragging

సోషల్ మీడియా ఎఫెక్ట్ పిల్లల మీద ఎంతుందో చెప్పడానికి మరో ఉదాహరణ బయటపడింది. ఇప్పటి వరకూ కాలేజీలను ఏలిన ర్యాగింగ్ భూతం ఇప్పుడు స్కూళ్ళల్లో కూడా నిద్ర లేచింది. ఇంతకు ముందు కూడా కొన్ని స్కూల్స్, హాస్టల్స్ లోఇది ఉండేది. అయితే ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవడంతో కొన్నాళ్ళు ఈ సమస్య దూరం అయింది. ఇప్పుడు మళ్ళీ ఓ కార్పొరేట్ స్కూల్లో ర్యాగింగ్ చిగురించడం కలకలం రేపుతోంది. రాజమండ్రి శ్రీ చైతన్య స్కూల్లో జరిగిన సంఘటన అందరినీ ఉలిక్కిపడేలా చేసింది. 

రాజమండ్రి శ్రీ చైతన్య స్కల్లో గుర్రం విన్సెంట్ ప్రసాద్ అనే అబ్బాయి చదువుతున్నాడు.  కోనసీమ జిల్లా మలికిపురం మండలం శంకరగుప్తం స్వస్థలం. ఇతన్ని బాగా చదివించాలనే ఉద్దేశంతో తల్లిదండ్రులు బాగా ఖర్చు పెట్టి మరీ శ్రీ చైతన్య స్కూల్లో జాయిన్ చేశారు. దాంతో పాటూ హాస్టల్ ఉంచి చదివిస్తున్నారు. కానీ అదే ఆ పిల్లాడి పాలిట శాపం
అయింది. తోటి విద్యార్థుల కారణంగా పదో తరగతి చదువుతున్న ప్రసాద్ ఈరోజు ఆసుపత్రి పాలయ్యారు. స్కూల్లో వెకిలి పనులు చేసే ఇద్దరు పిల్ల కారణంగా తీవ్రగాయాలతో చికిత్స పొందుతున్నాడు. 

అసలేమైందంటే...

హాస్టల్ లో ఇద్దరు విద్యార్థులు ఎప్పుడూ అల్లరి పనులు చేస్తుంటారు. ఇందులో భాగంగా వారిద్దరూ హాస్టల్ లో ఉన్న సీసీ కెమెరాలను తీసేశారు. ఇది గమనించిన ప్రిన్సిపల్ స్టూడెంట్స్ అందరినీ అడిగారు. అప్పుడు ప్రసాద్...ఆ ఇద్దరి పిల్లల పేర్లనూ చెప్పారు. దీంతో వారికి ప్రిన్సిపల్ పనిష్‌మెంట్ ఇచ్చారు. అయితే ఈ కారణంగా వారిద్దరూ ప్రసాద్ పై కక్ష కట్టారు. తమ మీద ప్రిన్సిపల్ కు కంప్లైంట్ ఇస్తావా అంటూ ఐరన్ బాక్స్ తో  పొట్ట, చేతులపై విచక్షణారహితంగా కాల్చారు. దీంతో అతను తీవ్ర గాయాలపాలయ్యాడు. ఈ చర్యకు విపరీతంగా భయపడిన ప్రసాద్ కాలిన గాయాల గురించి 
భయంతో ఎవరికీ చెప్పలేదు. కానీ చివరకు తల్లిదండ్రులకు తెలిసింది. దీంతో అతణ్ణి వెంటనే ఆసుపత్రిలో జాయిన్ చేశారు. దీనిపై స్కూల్ యాజమాన్యానికి ఫిర్యాదు చేశారు. లక్ష రూపాయలు ఫీజు కట్టి చదివిస్తుంటే వారు మాత్రం పిల్లలను ఏ మాత్రం పట్టించుకోవడం లేదని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. 

Advertisment
తాజా కథనాలు