Allu Arjun: బన్నీకి ఆరోగ్యం బాలేదు..అందుకే పుష్ప 2 కి బ్రేక్!
అల్లు అర్జున్ వెన్ను నొప్పితో బాధపడుతుండటం వల్ల పుష్ప 2 సినిమా షూటింగ్ వాయిదా పడినట్లు చిత్ర బృందం తెలిపింది. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ రామోజీ ఫిలిం సిటీలో జరుగుతుంది.
అల్లు అర్జున్ వెన్ను నొప్పితో బాధపడుతుండటం వల్ల పుష్ప 2 సినిమా షూటింగ్ వాయిదా పడినట్లు చిత్ర బృందం తెలిపింది. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ రామోజీ ఫిలిం సిటీలో జరుగుతుంది.
టాలీవుడ్ స్టార్ హీరో అల్లు అర్జున్ రెమ్యూనరేషన్ భారీగా పెంచేసినట్లు తెలుస్తోంది. సుకుమార్ దర్శకత్వంలో రాబోతున్న 'పుష్ప 2' కోసం ఏకంగా రూ.300 కోట్లు తీసుకుంటున్నట్లు టాక్ వినిపిస్తోంది. అంతేకాదు ఈ సినిమా లాభాల్లోనూ బన్నీకి వాటా ఉందని ఇండస్ట్రీలో చర్చనడుస్తోంది.
సుకుమార్ సంచలనం పుష్ప పార్ట్ 1 పాన్ ఇండియా లెవెల్ లో సృష్టించిన విధ్వంసం గురించి తెలిసిందే. పుష్ప రాజ్ పాత్రలో అల్లు అర్జున్ నట విశ్వరూపానికి జాతీయ అవార్డే తల వంచేసింది. ఇప్పుడు వచ్చే పుష్ప-2 అంతకు మించి ఉంటుంది అంటున్నాడు ఈ సినిమా మ్యూజిక్ డైరెక్టర్ దేవీ శ్రీ ప్రసాద్.
డైరెక్టర్ సుకుమార్ గురించి టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒక టాక్ ఉంది. సుకుమార్ సినిమా విషయంలో చాలా ఖచ్చితంగా ఉంటారని. అయితే భారీ అంచనాలతో తెరెకెక్కుతున్న పుష్ప 2 విషయంలో సుకుమార్ చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారంట. సినిమా అవుట్ పుట్ విషయంలో ఎక్కడా కూడా కాంప్రమైజ్ కావడం లేదని టాక్. సినిమా క్వాలిటీ విషయంలో విషయంలో సుకుమార్ చాలా ఖచ్చితంగా ఉన్నట్లు తెలుస్తుంది. మరి సుకుమార్ కష్టానికి ఈ సీక్వెల్, ఎలాంటి రిజల్ట్ ఇస్తుందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
పుష్ప 2 సినిమాలో అదిరిపోయే క్లైమాక్స్ .. డైరెక్టర్ సుకుమార్ పెద్ద ట్విస్ట్ ఇవ్వబోతున్నట్లు నెట్టింట్లో వార్తలు వైరలవుతున్నాయి .
ఓ ఏడాదికి సరిపడ కాల్షీట్లు ఇప్పటికే ఎడ్జెస్ట్ చేసిన రష్మిక, ఇప్పుడు వచ్చే ఏడాది సినిమాలపై ఫోకస్ పెట్టింది. ఈ ఏడాది పుష్ప-2, రెయిన్ బో, యానిమల్ లాంటి సినిమాలకు కాల్షీట్లు ఇచ్చిన ఈ బ్యూటీ, వచ్చే ఏడాది మరిన్ని కొత్త సినిమాలకు కాల్షీట్లు ఇస్తోంది.
స్టార్ హీరోల్లో ఒక్కరు కూడా ఖాళీగా లేరు. తమ సినిమాల్ని పూర్తిచేసే పనిలో బిజీబిజీగా ఉన్నారు. ఎన్టీఆర్, అల్లు అర్జున్, రామ్ చరణ్, విజయ్ దేవరకొండ..ఇలా హీరోలంతా తమ సినిమాల షూటింగ్స్‌తో బిజీగా ఉన్నారు. ఏ హీరో ఏ సినిమా షూటింగ్లో ఎక్కడ ఉన్నారో చెక్ చేద్దాం..
పెద్ద సినిమాలన్నీ మరోసారి సెట్స్ పైకి వచ్చాయి. చకచకా షూటింగ్స్ పూర్తిచేసే పనిలో పడ్డాయి. ఆగస్ట్ 15 శెలవులు, అంతకంటే ముందు వర్షాల కారణంగా కొన్ని సినిమాల షూటింగ్స్ ఆగాయి. అలాంటి మూవీస్ అన్నీ ఇప్పుడు మళ్లీ కొత్త షెడ్యూల్స్ స్టార్ట్ చేశాయి. మహేష్, అల్లు అర్జున్, విజయ్ దేవరకొండ, ప్రభాస్, రామ్ చరణ్.. ఇలా చాలామంది హీరోల సినిమాలు చకచకా షూటింగ్ జరుపుకుంటున్నాయి.