అల్లు అర్జున్ ఆస్తుల విలువ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..ఎన్ని కోట్లంటే?
అల్లు అర్జున్ ఓ వైపు సినిమాలు చేస్తూనే మరోవైపు బిజినెస్‌లో దూసుకుపోతున్నాడు. అతడు నికర విలువ దాదాపు రూ.460 కోట్లుగా తెలుస్తోంది. పలు సంస్థలను నిర్మించడం, పెట్టుబడులు పెట్టడం వంటి వాటి ద్వారా ఈ మొత్తాన్ని సంపాదిస్తున్నట్లు సమాచారం.
‘పుష్ప 2’నా మజాకా.. రూ.1000 కోట్లకు పైగా ప్రీ-రిలీజ్ బిజినెస్!
పుష్ప2 చిత్రం ప్రీ రిలీజ్ బిజినెస్ భారీ స్థాయిలో జరిగినట్లు తెలుస్తోంది. దాదాపు రూ.1,000 కోట్లకు పైగా ప్రీ రిలీజ్ బిజినెస్ చేసినట్లు సమాచారం. ఇప్పుడిదే నెట్టింట హాట్ టాపిక్‌గా మారింది. ఇది తెలిసి అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ అవుతున్నారు.
BIG BREAKING: ‘పుష్ప2’ ప్రీమియర్‌కు ముందు పోలీసుల లాఠీ ఛార్జ్!
నటుడు అల్లు అర్జున్ నటించిన ‘పుష్ప 2’ చిత్రం ప్రీమియర్ షోకు ముందు హైదరాబాద్‌లోని సంధ్య థియేటర్‌కి అభిమానులు భారీగా తరలివచ్చారు. జనాన్ని అదుపు చేసేందుకు పోలీసులు స్వల్ప లాఠీచార్జి చేశారు.
పుష్ప-2కు షాక్.. బెనిఫిట్ షోలు రద్దు
పుష్ప 2 సినిమాకు ఊహించని షాక్ తగిలింది. కర్ణాటకలో ఈ మూవీని మిడ్ నైట్, తెల్లవారుజామున ప్రదర్శించవద్దని అక్కడి ప్రభుత్వం ఆదేశాలిచ్చింది. ఉదయం 6గంటల కంటే ముందు సినిమాను ప్రదర్శించడం చట్ట విరుద్ధమని కన్నడ ప్రొడ్యూసర్లు ఫిర్యాదు చేయడంతో ఈ నిర్ణయం తీసుకుంది.
Pushpa-2: ‘పుష్ప2’ రిలీజ్ వేళ.. నాగబాబు ఆసక్తికర ట్వీట్
అల్లు అర్జున్ ‘పుష్ప2’ సినిమాపై నాగబాబు ఆసక్తికర ట్వీట్ చేశారు. ప్రతిసినిమా విజయం సాధించాలని..ప్రేక్షకులు అన్ని సినిమాలను చూసి ఆదరించాలని కోరుకుంటున్నామని అన్నారు. మెగా అభిమానులు, సినీ ప్రియులు సినిమాని ఈ స్ఫూర్తితో ఆదరించాలని విజ్ఞప్తి చేస్తున్నానన్నారు.
పుష్ప 2 టికెట్లను సుబ్బారావు ఇడ్లీతో పోల్చిన RGV.. సంచలన ట్వీట్
పుష్ప 2 టికెట్ రేట్లను సమర్థిస్తూ ఆర్జీవీ ఓ లాజిక్ తీసుకొచ్చి ఇడ్లీ కొట్టుతో పోల్చి చెప్పాడు. వెయ్యి రూపాయల టికెట్ రేట్ పెట్టినా ఎక్కడా కూడా సీట్లు దొరకడం లేదని, అన్ని బుక్ అయిపోయాయని పేర్కొన్నాడు. ప్రస్తుతం అతడి ట్వీట్ నెట్టింట వైరల్ అవుతోంది.
Pushpa-2 : పుష్ప 2 సినిమాకు విషెస్ చెప్పిన మొట్టమొదటి మెగా హీరో
పుష్ప2 చిత్రానికి మెగా హీరో సాయి ధరమ్ తేజ్ ఆల్ ది బెస్ట్ చెప్పారు. ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందని అన్నారు. ఈ మేరకు ట్విట్టర్ వేదికగా ఓ ట్వీట్ పంచుకున్నారు. ప్రస్తుతం ఆ ట్వీట్ నెట్టింట వైరల్ అవుతోంది.
Pushpa-2 : 'పుష్ప2' టికెట్ రేట్ల పెంపు కేసు.. హైకోర్టు సంచలన తీర్పు
'పుష్ప 2' రిలీజ్ కు తెలంగాణ హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అధిక మొత్తంలో టికెట్ ఛార్జీలు వసూలు చేయడాన్ని అడ్డుకోవాలని పిటిషన్ పై విచారించిన న్యాయ స్థానం చివరి నిమిషంలో సినిమా రిలీజును ఆపలేమని ఆదేశాలిచ్చింది. తదుపరి విచారణను 2 వారాలకు వాయిదా వేసింది.