ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న పుష్ప 2 మూవీ ఎట్టకేలకు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కాంబోలో పార్ట్-1 కు సీక్వెల్ గా తెరకెక్కడంతో ఈ మూవీపై ఓ రేంజ్ లో అంచనాలు నెలకొన్నాయి. ఇక తెలుగు రాష్ట్రాల్లో గురువారం రాత్రి 9.30 గంటల నుంచే 'పుష్ప2' స్పెషల్ షోస్ పడిపోయాయి. దీంతో సినిమా చూసిన ప్రేక్షకులు సోషల్ మీడియా వేదికగా తమ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు. ఈ సినిమాకు అంతటా పాజిటివ్ టాక్ వస్తోంది. సినిమాలోని యాక్షన్ సన్నివేశాలు, డ్యాన్స్‌లు ప్రేక్షకుల్లో జోష్ నింపుతున్నాయి. ముఖ్యంగా జాతర ఎపిసోడ్ అద్భుతమంటూ సోషల్ మీడియా వేదికగా అభిమానులు ప్రశంసిస్తున్నారు. అందులో అల్లు అర్జున్ మరో స్థాయిలో నటించారంటూ పొగిడేస్తున్నారు. Meeru ikkada edusthu undandi, bhAAi akkada eduguthu untadu🔥🔥🔥Can"t define your performance ra ayya @alluarjun 🙏🏻Thanks for the HIGH ❤️🔥#Pushpa2TheRule pic.twitter.com/FvG1VaSqXb — Insane Icon (@icon_trolls) December 4, 2024 Also Read : 'పుష్ప2' జాతర ఎపిసోడ్.. ఆడియన్స్ రెస్పాన్స్ చూసి మురిసిపోయిన బన్నీ, వీడియో వైరల్ అదొక్కటే మైనస్.. గంగమ్మతల్లి అవతారంలో ఐకాన్ స్టార్ తన నట విశ్వరూపంతో గూస్‌బంప్స్ తెప్పించారని చెబుతున్నారు. అన్నీ బాగానే ఉన్నా ఫ్యాన్స్ మాత్రం ఒక్క విషయంలో డిసప్పాయింట్ అయ్యారు. 'పుష్ప' పార్ట్-1 తో పోల్చుకుంటే పార్ట్-2 లో హీరో ఎలివేషన్ సీన్స్ చాలా తక్కువగా ఉన్నాయట. ఈ విషయంలో ఫ్యాన్స్ కొంత నిరాశ చెందుతున్నారు. పార్ట్-1 లో అల్లు అర్జున్ స్క్రీన్ పై కనిపించిన ప్రతీ సీన్ మాస్ ఎలివేషన్ తోనే ఉంటుంది. కానీ 'పుష్ప2' లో మాత్రం అలాంటి సీన్స్ తక్కువగా ఉన్నాయి. పార్ట్-1 లో ఓన్లీ హీరోనే ఎలివేట్ చేసిన సుకుమార్.. పార్ట్-2 లో మాత్రం స్టోరీ, ఎమోషనల్ సీన్స్ పై ఎక్కువగా ఫోకస్ చేసినట్లు కనిపించాడు. అలా అని ఇందులో హీరోకి ఎలివేషన్ సీన్స్ లేవని కాదు.. ఉన్నా కూడా పార్ట్-1 లో ఉన్నంత లేవనేది ఫ్యాన్స్ మాట. Also Read : 'పుష్ప2' పై RGV రివ్యూ.. ఏం చెప్పాడంటే..!