సీఎం క్యాంప్ ఆఫీస్ మార్పు!.. MCRHRDకి తరలింపు
తెలంగాణ సీఎం క్యాంప్ ఆఫీసు ప్రగతి భవన్ నుంచి మారబోతున్నది. అక్కడి నుంచి క్యాంప్ ఆఫీసును డాక్టర్ మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రం (MCRHRD) ప్రాంగణంలోకి రాబోతున్నది.
తెలంగాణ సీఎం క్యాంప్ ఆఫీసు ప్రగతి భవన్ నుంచి మారబోతున్నది. అక్కడి నుంచి క్యాంప్ ఆఫీసును డాక్టర్ మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రం (MCRHRD) ప్రాంగణంలోకి రాబోతున్నది.
ప్రగతి భవన్...ప్రజా భవన్ అయింది. ఇక మీదట ఇది అన్ని రోజులూ ప్రజలకు అందుబాటులో ఉండనుంది. ఇవాళ పదిగంటలకు జ్యోతిరావు పూలే భవన్ లో ప్రజా దర్బార్ నిర్వహించనున్నారు సీఎం రేవంత్ రెడ్డి.
ప్రభుత్వం మారింది.. ప్రగతి భవన్ వద్ద సీన్ మారింది. ప్రగతి భవన్ ముందు ఉన్న భారీ ఇనుగ గేట్లు, షెడ్డును తొలగించేస్తున్నారు అధికారులు. గ్యాస్ కట్టర్ సాయంతో ఇనుక బారీకేడ్లను తొలగిస్తున్నారు. ప్రజల రాకపోకలకు వీలుగా ఉండేలా చర్యలు చేపడుతున్నారు.
తెలంగాణ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఓటమి తరువాత కేసీఆర్ తన సీఎం పదవికి రాజీనామా చేశారు. అనంతరం తన ఫామ్ హౌస్ కు వెళ్లిపోయారు. అయితే, ప్రస్తుతం కేసీఆర్ ఏం చేస్తున్నారు అనేదానిపై రాష్ట్ర ప్రజల్లో చర్చ జరుగుతోంది.