పోసానికి అనారోగ్యం.. రంగంలోకి పూనమ్..

రిమాండ్ ఖైదీగా జైల్లో పోసాని కృష్ణమురళి ఆరోగ్యం క్షీణించడంతో పరీక్షలు నిర్వహించిన విషయం తెలిసిందే. పోసాని ఆరోగ్యంపై సినీ నటి పూనం కౌర్ స్పందించారు. పోసాని ఆరోగ్యం పట్ల కాస్త దిగులుగా ఉందని, ఆయనని జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం ఉందని తెలిపారు.

New Update
Poonam Kaur Respond

Poonam Kaur Respond Photograph: (Poonam Kaur Respond)

ప్రముఖ నటుడు పోసాని కృష్ణ మురళిని ఏపీ పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం కృష్ణ మురళి రిమాండ్ ఖైదీగా జైల్లో ఉన్నారు. అయితే కృష్ణమురళి అనారోగ్య సమస్యల బారిన పడటంతో వెంటనే అతన్ని కడప రిమ్స్ ఆసుపత్రికి తరలించి వైద్య పరీక్షలు చేస్తున్నారు. ఈ క్రమంలో అతని ఆరోగ్యంపై సినీ నటి పూనం కౌర్ స్పందించారు.

ఇది కూడా చూడండి: SLBC: డాక్టర్‌గా చెబుతున్నా.. టన్నెల్‌లో చిక్కుకున్న వారి పరిస్థితి ఇది.. ఎమ్మెల్యే వంశీకృష్ణ సంచలన ప్రకటన!

అతని ఆరోగ్యం పట్ల బాధపడుతున్నట్లు..

ఏపీ రాజకీయాలు చాలా దరిద్రంగా ఉన్నాయని, ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఎక్కువ ఇబ్బందులు ఉన్నాయని ఆమె అన్నారు. బలహీనులను అరెస్టు చేయడం పగ తీర్చుకోవడం కోసమేనని అన్నారు. వ్యక్తిగతంగా ఆమె ఎంతో ఇబ్బంది పడ్డారని, అతని ఆరోగ్యం పట్ల కాస్త దిగులుగా ఉందని పూనం తెలిపారు. ఈయనను ఇంకా జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. గతంలో పోసాని పూనం కౌర్‌పై కూడా ఆరోపణలు చేశారు. అతని మాటల వల్ల ఇబ్బంది పడినా కూడా పూనం పోసాని ఆరోగ్యం పట్ల బాధపడుతున్నట్లు తెలిపారు. 

ఇది కూడా చూడండి: Crime: 13ఏళ్ల పగ.. నంబర్ బ్లాక్ చేసిన ప్రియుడిని కత్తితో పొడిచి, కారు ఎక్కించిన యువతి.. లాస్ట్ ట్విస్ట్ అదిరింది!

ఇదిలా ఉండగా పోసాని రిమాండ్ రిపోర్ట్‌లో సంచలన విషయాలు బయటపడ్డాయి. పవన్ కళ్యాణ్, లోకేశ్ కుటుంబ సభ్యులను దూషించినట్లు ఒప్పకోవడంతో పాటు సజ్జల రామకృష్ణారెడ్డి ప్రమేయం కూడా ఉన్నట్లు తెలిపారు. సజ్జల ఇచ్చిన స్క్రిప్ట్ ప్రకారమే విమర్శలు చేశానని, కావాలనే పవన్ ఫ్యాన్స్‌ను రెచ్చగొట్టానని పోసాని వెల్లడించారు. 

ఎఫ్‌డీసీ ఛైర్మన్‌గా ఉంటూ వైసీపీకి సపోర్ట్ చేశానని పోసాని పోలీసులకు తెలిపారు. పవన్‌ను వ్యక్తిగతంగా దూషించడం వెనుక సజ్జల రామకృష్ణారెడ్డి అనుమతితోనే మీడియా సమావేశం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. మాట్లాడిన మాటలు అన్ని కూడా సజ్జల కొడుకు భార్గవరెడ్డి సోషల్ మీడియాల్లో వైరల్ చేసేవాడని పోసాని రిమాండ్‌లో వెల్లడించారు.

ఇది కూడా చూడండి: Viral Video: ఎవర్రా మీరంతా.. ఇండియాలో ఇద్దరు మగాళ్ల పెళ్లి.. డ్యాన్స్‌లతో హోరెత్తించిన తల్లిదండ్రులు!

Advertisment
తాజా కథనాలు