ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, ఎంపీ సంజయ్ సింగ్ లకు షాక్....!
ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్, ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ లకు షాక్ తగిలింది. ప్రధాని మోడీ డిగ్రీ సర్టిఫికేట్ల కేసులో దాఖలైన పరువు నష్టం కేసులో వారిపై చర్యలు తీసుకోకుండా తాత్కాలికంగా స్టే ఇచ్చేందుకు గుజరాత్ హై కోర్టు నిరాకరించింది. ఈ కేసులో స్టే ఇవ్వాలన్న అరవింద్ కేజ్రీవాల్ తరఫు న్యాయవాది జస్టిస్ సమీర్ దవే అభ్యర్థనను న్యాయమూర్తి జస్టిస్ సమీర్ దవే తిరస్కరించారు.