Petrol Prices: ఈరోజు పెట్రోల్ ధరలు ఎలా ఉన్నాయంటే!
క్రూడాయిల్ ధరలు రోజురోజుకి పెరుగుతూ వస్తున్నాయి. అంతర్జాతీయంగా ఉన్న ఆర్ధిక పరిస్థితులకు తోడు.. మధ్యప్రాచ్యంలో నెలకొన్న యుద్ధ వాతావరణంతో క్రూడాయిల్ ధరల పెరుగుదల కొనసాగుతోంది.
క్రూడాయిల్ ధరలు రోజురోజుకి పెరుగుతూ వస్తున్నాయి. అంతర్జాతీయంగా ఉన్న ఆర్ధిక పరిస్థితులకు తోడు.. మధ్యప్రాచ్యంలో నెలకొన్న యుద్ధ వాతావరణంతో క్రూడాయిల్ ధరల పెరుగుదల కొనసాగుతోంది.
పెట్రోల్, డీజిల్, సహజవాయువు వంటి వస్తువులను జీఎస్టీ పరిధిలోకి తీసుకురావడాన్ని పరిశీలిస్తున్నామని కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరి తెలిపారు. అయితే కేంద్రమంత్రి వ్యాఖ్యలతో ఇప్పుడు చమురు జీఎస్టీ పరిధిలోకి వస్తే ధరలు తగ్గుతాయా.. అనే చర్చలు జరుగుతున్నాయి.
దేశంలో పెట్రోల్, డీజిల్ ధరల తగ్గింపుపై కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పురి కీలక వ్యాఖ్యలు చేశారు. భౌగోళిక రాజకీయాల్లో స్థిరత్వం వచ్చిన తర్వాతే చమురు ధరల తగ్గింపు సాధ్యం అవుతుందన్నారు. 2021 నుంచి కేంద్రం రెండు సార్లు పెట్రోల్, డీజిల్ పై ఎక్సైజ్ సుంకాలను తగ్గించిందని తెలిపారు.
పెట్రోల్ లో ఇథనాల్ కలపడం ద్వారా మన దేశం భారీగా విదేశీ మరకద్రవ్యాన్ని ఆదా చేస్తోంది. అంతేకాకుండా చెరకు రైతులకు కూడా సత్వర చెల్లింపులు చేయగలుగుతోంది ప్రభుత్వం. ఈ సంవత్సరం పెట్రోల్ లో ఇథనాల్ కలపడం ద్వారా 24,300 కోట్లకు పైగా విదేశీ మారకద్రవ్యం ఆదా అయింది.
దేశ వ్యాప్తంగా ట్రక్కు డ్రైవర్లు రెండురోజుల పాటూ సమ్మె చేయడంతో పెట్రోల్‌కు విపరీతమైన కొరత ఏర్పడింది. దీంతో చాలామంది వాహనదారులు పెట్రోల్ అయిపోయి ఇబ్బందులు పడుతున్నారు. ఇదే ప్రాబ్లెమ్ ఫేస్ చేసిన ఒక డెలివరీ బాయ్ ఆప్షన్ లేక గుర్రం మీద వెళ్ళి మరీ డెలివరీ చేశాడు.
ట్రక్కు డైవర్ల సమ్మె ప్రభావం జనాల మీద బాగా పడింది. ముఖ్యంగా పెట్రోల్ కోసం జనాలు అల్లల్లాడిపోతున్నారు. సమ్మె విరమించినా ఇంకా ట్యాంకర్లు బంకులకు చేరుకోకపోవడంతో పెట్రోల్ లేక అవస్థలు పడుతున్నారు.
ట్రక్ డైవర్లు, ఆయిల్ ట్యాంకర్ల యజమానులు ధర్నా విరమించారు. మోటారు వాహనాల చట్టాన్ని సవరించడాన్ని నిరసిస్ దేశ వ్యాప్తంగా వీరు రెండు రోజులుగా సమ్మె చేస్తున్నారు. దీంతో పెట్రోల్ బంకుల దగ్గర జనాలు క్యూలు కట్టారు.