Rajnath Singh : ప్రపంచం ఆశ్చర్యపోయేలా ప్రతీకారం ఉంటుంది: రాజ్నాథ్ సింగ్ సంచలన కామెంట్స్
భారత్ ను ఎవరూ భయపెట్టలేరని కేంద్ర మంత్రి రాజ్ నాథ్ సింగ్ అన్నారు. పహల్గాంలో ఉగ్రదాడిపై ఆయన స్పందించారు. ప్రపంచం ఆశ్చర్యపోయేలా జవాబు ఇస్తామని అన్నారు. పహల్గాం దాడికి అతి త్వరలో ప్రతీకారం తీర్చుకుంటామని.. ఒక్క దోషిని కూడా విడిచిపెట్టే ప్రసక్తి లేదన్నారు