Pawan Kalyan Fires On Pahalgam Terror Incident | పవన్ ఉగ్రరూపం | Kasmir Attack | PM Modi | RTV
పహల్గామ్ ఉగ్రవాద దాడికి సంబంధించి మరో వీడియో బయటకు వచ్చింది. పర్యాటకుడు రిషి భట్ జిప్ లైన్ పై వేలాడుతూ తీసుకున్న వీడియోలో..బైసరన్ లోయను ఉగ్రవాదులు తమ ఆధీనంలోకి తీసుకుంటున్న విజువల్స్ ను అందులో ఉన్నాయి. జిప్‌లైన్ ఆపరేటర్ పై అతను అనుమానాలు వ్యక్తం చేశాడు.
భారత్ దగ్గర 180, పాకిస్తాన్ దగ్గర 170 అణ్వాయుధాలు ఉన్నాయి. అయితే భారత్ ముందుగా అణ్వాయుధాలు ప్రయోగించదు. ఎందుకంటే భారత్ అణు విధానం నో ఫస్ట్ యూస్. కానీ పాక్ మొదట న్యూక్లియర్ దాడి చేసే అవకాశం ఉంది. 2 దేశాలు అణ్వాయుధాలు వాడాలంటే ప్రధాని నిర్ణయం తీసుకోవాలి.
పహల్గాం ఉగ్రదాడి అనంతరం భారత్, పాకిస్థాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ పరిస్థితులను దౌత్య మార్గం ద్వారా పరిష్కరించుకోవాలని, యుద్ధం వద్దని పాక్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్.. ప్రస్తుతం ప్రధాని షెహబాజ్ షరీఫ్‌కు సూచించినట్లు తెలుస్తోంది.
పాకిస్తాన్ తీవ్ర ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. అక్కడ ధరలు మాములుగా లేవు.. కిలో చికెన్ ధర రూ.800 గా ఉంది. బియ్యం ధర కిలోరూ.340. గుడ్లు, పాలు వంటి ఇతర నిత్యావసర వస్తువుల ధరలు కూడా గణనీయంగా పెరిగాయి, గుడ్ల ధర డజనుకు రూ.332, పాలు లీటరుకు రూ.224గా ఉంది.
పహల్గామ్ దాడికి సంబంధించి జమ్మూ కశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా అసెంబ్లీలో సోమవారం చాలా భావోద్వేగ ప్రసంగం చేశారు. ఈ దాడి జరిగిన తర్వాత తాను పూర్తి రాష్ట్ర హోదాను ఎలా అడగగలనని ఆయన అన్నారు.
పహల్గామ్ టెర్రర్ అటాక్ లైవ్ అప్డేట్లు ఎప్పటికప్పుడు మీ కోసం
పహల్గామ్ ఉగ్రవాద దాడిలో పాల్గొన్న ఉగ్రవాదులకు కశ్మీర్‌లోనే ఉన్న 15 మంది కశ్మీరీలే సహాయం చేశారని NIA దర్యాప్తులో వెల్లడైంది. ఎలక్ట్రానిక్ నిఘా ఆధారంగా ఈ సహాయకులను గుర్తించారు. ఈ వ్యక్తులు ఉగ్రవాదులకు లాజిస్టిక్స్ అందించారని సమాచారం.