🔴Operation Sindoor Live Updates: ఆపరేషన్ సిందూర్ - లైవ్
పహల్గాం ఉగ్రదాడికి కౌంటర్‌గా పాక్ ఉగ్రస్థావరాలపై మెరుపుదాడులు చేపట్టింది భారత్. తొమ్మిది చోట్ల దాడులు చేసినట్లు భారత ప్రభుత్వం ప్రకటించింది. దాడి ఘటన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
పహల్గాం ఉగ్రదాడికి కౌంటర్‌గా పాక్ ఉగ్రస్థావరాలపై మెరుపుదాడులు చేపట్టింది భారత్. తొమ్మిది చోట్ల దాడులు చేసినట్లు భారత ప్రభుత్వం ప్రకటించింది. దాడి ఘటన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
పహల్గామ్ ఉగ్రవాద దాడితో పాటుగా పార్లమెంట్ పై దాడి, ముంబైలోదాడి, 2019లో ఇండియన్ ఆర్మీపై చేసిన ఉగ్రవాద దాడులను హైలైట్ చేస్తూ భారత ప్రభుత్వం ఒక వీడియోను విడుదల చేసింది.
బుధవారం రాత్రి 1.30 గంటలకు 9 ఉగ్రవాద స్థావరాలపై భారత్ వైమానిక దాడి చేసింది. ఈ దాడికి 'ఆపరేషన్ సిందూర్' అని పేరు పెట్టారు. భారత ఆర్మీ.. పాకిస్తాన్‌లోని 4 ప్రదేశాలను, పీఓకేలోని 5 ప్రదేశాలను లక్ష్యంగా చేసుకుని కాల్పులు జరుపుతోంది.
తెలంగాణలో అక్రమంగా నివాసం ఉంటున్న పాకిస్తానీలను గుర్తించి వెనక్కు పంపించాలని బీజేపీ నేతలు డిమాండ్ చేశారు. ఈ మేరకు ఈ రోజు గవర్నర్ ను కలిసి వినతి పత్రం అందించారు. గవర్నర్ ను కలిసిన వారిలో బీజేపీ రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్, విజయ రామారావు తదితరులు ఉన్నారు.