AP : ఎమ్మెల్యేను అడ్డుకున్న టీడీపీ శ్రేణులు.. మండల సమావేశం రసాబస..!
ప్రకాశం జిల్లా దొనకొండ మండల సర్వసభ్య సమావేశం రసాబసగా మారింది. సమావేశానికి వచ్చిన ZP ఛైర్మెన్ వెంకాయమ్మ, దర్శి వైసీపీ ఎమ్మెల్యే శివ ప్రసాద్ రెడ్డి లను టీడీపీ శ్రేణులు అడ్డుకున్నారు. దోనకొండకు నీటి సమస్య తీర్చలేదని ఆందోళన చేపట్టగా ఇరువర్గాల మధ్య తోపులాట జరిగింది.