25 ఏళ్ళ కంచుకోట బద్దలు..ఒడిశాలో ప్రభుత్వ ఏర్పాటు దిశగా బీజేపీ
పాతికేళ్ళుగా ఒడిశాలో ఆపార్టీని ఎవవరూ ఏమీ చెయ్యలేకపోయారు. కానీ ఈసారి బీజేపీ దాన్ని ఛేదించింది. బీజేడీ సామ్రాజ్యాన్ని కుప్పకూల్చి ప్రభుత్వ ఏర్పాటు దిశగా దూసుకెళుతోంది.
పాతికేళ్ళుగా ఒడిశాలో ఆపార్టీని ఎవవరూ ఏమీ చెయ్యలేకపోయారు. కానీ ఈసారి బీజేపీ దాన్ని ఛేదించింది. బీజేడీ సామ్రాజ్యాన్ని కుప్పకూల్చి ప్రభుత్వ ఏర్పాటు దిశగా దూసుకెళుతోంది.
ఒడిశాలోని పూరీ జగన్నాథుని చందన యాత్ర ఉత్సవాల సందర్భంగా అపశ్రుతి చోటు చేసుకుంది. భక్తులు అంతా గుమిగూడిన చోట బాణాసంచా పేలడంతో 15 మందికి తీవ్రగాయాలయ్యాయి. అందులో నలుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్టు పోలీసులు చెప్పారు.
దేశంలో ఎన్నికల ప్రక్రియలో జూన్ 1 న చివరి విడత ఎన్నికలు జరగనున్నాయి. ఈ సమయంలో ఒడిశాలో ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ప్రత్యేక కార్యదర్శి డిఎస్ కుటేను సస్పెండ్ చేస్తూ ఈసీ సంచలన నిర్ణయం తీసుకుంది.
ఓటు వేసే సందర్భంలో బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఈవీఎంను ధ్వంసం చేయడంతో చాలా సేపు పోలింగ్ కు అంతరాయం ఏర్పడింది. ఈ నేపథ్యంలోనే ఆ బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి పై ఎన్నికల ప్రిసైడింగ్ అధికారి ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు ఆయనను అరెస్ట్ చేశారు.
సార్వత్రిక ఎన్నికల వేళ బీజేపీ, మోడీ పనితీరుపై ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒడిశా సంపన్న రాష్ట్రంగా ఎదగకపోవడానికి కేంద్ర ప్రభుత్వమే కారణమన్నారు. ఒడిశా ప్రజల హృదయాలను బీజేపీ ఎప్పటికీ గెలుచుకోలేదన్నారు.
తెలుగు రాష్ట్రాలతో పాటూ ఒడిశాలో కూడా మే 13నే అసెంబ్లీ, లోక్సభ ఎన్నికలు జరగనున్నాయి. దీంతో అక్కడ బీజేపీ తన ప్రచారాన్ని ముమ్మురం చేసింది. ఇందులో బాగంగా ఈరోజు ప్రధాని మోదీ ఒడిశాలో పర్యటించనున్నారు.
ఒడిశాలోని భువనేశ్వర్లో వర్షం కారణంగా.. ప్రతికూల వాతావరణం ఏర్పడటంతో సీఎం నవీన్ పట్నాయక్ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ భువనేశ్వర్ ల్యాండింగ్ కాలేదు. దాదాపు 30 నిమిషాల పాటు గాల్లోనే తిరిగింది. చివరికి ఝర్సుగూడలో ల్యాండ్ కావడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
ఒడిశాలో ఘోర ప్రమాదం జరిగింది. జాజ్ పూర్లో కోల్ కతా వెళ్లే వంతెనపై నుంచి బస్సు కింద పడింది. ఈ ప్రమాదంలో ఐదుగురు అక్కడిక్కడే మరణించారు. మరో 40 మందికి తీవ్ర గాయాలయ్యాయి.