Breaking : వంతెన పై నుంచి పడిన బస్సు.. 5 మంది మృతి, 40 మందికి గాయాలు..!
ఒడిశాలో ఘోర ప్రమాదం జరిగింది. జాజ్ పూర్లో కోల్ కతా వెళ్లే వంతెనపై నుంచి బస్సు కింద పడింది. ఈ ప్రమాదంలో ఐదుగురు అక్కడిక్కడే మరణించారు. మరో 40 మందికి తీవ్ర గాయాలయ్యాయి.
ఒడిశాలో ఘోర ప్రమాదం జరిగింది. జాజ్ పూర్లో కోల్ కతా వెళ్లే వంతెనపై నుంచి బస్సు కింద పడింది. ఈ ప్రమాదంలో ఐదుగురు అక్కడిక్కడే మరణించారు. మరో 40 మందికి తీవ్ర గాయాలయ్యాయి.
పోలీసులు యునిఫాం బయట కనిపించే టాటూలను15 రోజుల్లోగా తొలగించాలని ఒడిశాలోని పోలీస్ శాఖ ఆదేశాలు జారీ చేసింది. ఎవరైనా ఈ ఆదేశాలు పాటించడంలో విఫలమైతే.. వాళ్లపై శాఖపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.
ఒడిశాలోని బెర్హంపూర్ 'పబ్లిక్ రీసెర్చ్ అండ్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్' నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది. డిగ్రీ అర్హతతో డైరెక్ట్ రిక్రూట్ మెంట్ ప్రతిపాదికన 3 ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హులైన అభ్యర్థులు 2024 ఫిబ్రవరి 5వరకూ ఆన్ లైన్ లో అప్లై చేసుకోవాలి.
అంబులెన్స్ కి అద్దె చెల్లించలేక మృతదేహాన్ని 20 కిలోమీటర్లు మోసుకెళ్లిన విషాద ఘటన కొరపుట్ జిల్లా వరిగుమ్మ సమితిలో శనివారం చోటుచేసుకోగా ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఒడిశాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఒక బైకర్ అతివేగంగా వెళ్తూ ట్రాక్టర్ ను ఓవర్ టెక్ చేయబోయి ఎదురుగా వస్తున్న కారును ఢీ కొట్టాడు. కారు డ్రైవర్ అదుపుతప్పి పక్కనున్న ఆటోను ఢీ కొట్టాడు. ఆటో మరో రెండు బైకులను ఢీ కొట్టడంతో ముగ్గురు దుర్మరణం చెందారు. 13 మంది గాయపడ్డారు.
చికెన్, మటన్, రొయ్యలు ఇలా..నాన్ వెజ్ పచ్చళ్ళు రకరకాలున్నాయి. దాదాపుగా తెలుగు రాష్ట్రాల్లో అన్ని ప్రాంతాల్లో ఈ పచ్చళ్ళు తింటారు. కానీ ఎర్రచీమల పచ్చడి గురించి ఎప్పుడైనా విన్నారా...ఒరిస్సా ట్రైబల్ స్పెషల్ అయిన ఈ పచ్చడి ఇప్పుడు దేశ వ్యాప్తంగా ఫేమస్ కాబోతోంది.
ఒడిశా కియోంజర్ జిల్లాలోని సరస్పసి గ్రామంలో అమానవీయ ఘటన జరిగింది. తన వ్యవసాయ భూమిలో క్యాలీఫ్లవర్‌ను చోరీ చేసిందన్న అనుమానంతో ఓ తల్లి(70)ని ఆమె కుమారుడు కొట్టి, విద్యుత్ స్తంభానికి కట్టేశాడు. ఈ గొడవను అడ్డుకునేందుకు ప్రయత్నించిన గ్రామస్థులను శతృఘ్న బెదిరించాడు.
హైవేలపై రోడ్డు ప్రమాదాలను తగ్గించేందుకు ఒడిశా సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. రాత్రిపూట ప్రయాణించే భారీ వాహనాల డ్రైవర్లకు ఫ్రీగా టీ అందించే ఏర్పాట్లు చేయాలని నిర్ణయించినట్లు రవాణాశాఖ మంత్రి తుకుని సాహు తెలిపారు. ఆ ఖర్చు సర్కార్ భరిస్తుందన్నారు.
భార్య వివాహేతర సంబంధం పెట్టుకుందన్న అనుమానంతో ఆమె తల నరికాడు భర్త. ఒడిశా-నయాగఢ్ జిల్లాలోని బనిగొచ్చాలో ఆ ఘటన జరిగింది. భార్య తల నరికేసిన తర్వాత ఆ తలను పట్టుకోని పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి భర్త లొంగిపోయాడు.