Bihar: గురుద్వారాలో లంగర్ సేవలో ప్రధాని మోదీ..
ప్రధాని నరేంద్ర మోదీ బీహార్‌లోని గురుద్వారాలో హల్ చల్ చేశారు. ఆరెంజ్ టర్బన్ ధరించిన మోదీ పాట్నా సాహిబ్‌ను సందర్శించి..లంగర్ సేవలో పాల్గొన్నారు.
ప్రధాని నరేంద్ర మోదీ బీహార్‌లోని గురుద్వారాలో హల్ చల్ చేశారు. ఆరెంజ్ టర్బన్ ధరించిన మోదీ పాట్నా సాహిబ్‌ను సందర్శించి..లంగర్ సేవలో పాల్గొన్నారు.
ఏపీలో ఎన్నికల వేళ ఏలూరు జిల్లా దెందులూరులో ఉద్రిక్తత. అక్కడ టీడీపీ ప్రలోభాలకు పాలుపడుతోందంటూ వైసీపీ నేతలు ఘర్షణకు దిగారు. బూత్ నెంబర్ 64 దగ్గర పసుపు కండువాతో వచ్చి డబ్బులు పంచుతున్నారంటూ వైసీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఏపీలో ఎన్నికల వేళ శ్రీకాకుళం జిల్లా కిష్టప్ప పేట పోలింగ్ బూత్ లో వివాదం చోటుచేసుకుంది. వాలంటీర్ ను వైసీపీ ఏజెంట్ గా నియమించడంతో టీడీపీ ఏజెంట్లు అభ్యంతరం వ్యక్తం చేశారు. అక్కడి పీవో అభ్యంతరాన్ని తోసిపుచ్చడంతో టీడీపీ అభ్యర్థి కలెక్టర్ కు ఫిర్యాదు చేశారు.
పిఠాపురంలో కొందరు వ్యక్తులు ఓటర్ స్లిప్ లతో జంప్ కావడం చర్చనీయాంశమైంది. వైసీపీ నేతలే ఇలా చేశారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. డబ్బుల ఆశచూపి ఇలా చేశారని చెబుతున్నారు జనసేన నేతలు. ఉదయం ఓటు వేసే సమయానికి స్లిప్పులు ఇప్పిస్తామని పోలీసులు ఓటర్లకు హామీ ఇచ్చినట్లు సమాచారం.
ఖమ్మం జిల్లా కల్లూరు మండలం నారాయణపురం లో తెలంగాణ రాష్ట్ర రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి ఓటు హక్కు వినియోగించుకున్నారు. ప్రజలంతా ఓటింగ్ లో పాల్గొనాలని మంత్రి పిలుపునిచ్చారు.
ఏపీలో ఎన్నికలకు పోలింగ్ ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ ఏపీ ఓటర్లకు ప్రత్యేకంగా ట్వీట్ చేశారు. ఏపీ ప్రజలు.. ముఖ్యంగా మొదటిసారి వేసే ఓటు వేసేవారు రికార్డు స్థాయిలో అసెంబ్లీ ఎన్నికల్లో ఓటు వేయాలని ప్రధాని కోరారు.
హైదరాబాద్ లో సెలబ్రిటీలు ఒక్కరొక్కరుగా ఓటు వేయడానికి వస్తున్నారు. జూబ్లీహిల్స్ లో జూనియర్ ఎన్టీఆర్, ఫిలింనగర్ లో అల్లు అర్జున్ ఓటు వేశారు.
లోక్‌సభ ఎన్నికల నాలుగో దశ పోలింగ్ 10 రాష్ట్రాల్లో ప్రారంభమైంది. జమ్మూ, కాశ్మీర్ లో కొద్ధిసేపటి క్రితం పోలీంగ్ మొదలైంది. పోలింగ్ సందర్భంగా కట్టుదిట్టమైం భద్రతా చర్యలు తీసుకున్నారు అధికారులు