AP Elections 2024: ఏపీలో ఎన్నికల వేళ ఉద్రిక్త సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. శ్రీకాకుళం జిల్లా కిష్టప్పపేట పోలింగ్ బూత్‌లో తీవ్ర గందరగోళం నెలకొంది. వైసిపీ ఏజెంట్ గా వాలంటీర్ అక్కడకు రావడంతో టీడీపీ ఏజెంట్లు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఎలక్షన్ ఆఫీసర్ కు తమ అభ్యంతరాన్ని తెలియచేశారు. అయితే, ఆయన వాలంటీర్ ఏజెంట్ గా ఉండవచ్చని చెప్పారు. ఈలోపు వైసీపీ నేత ధర్మాన ప్రసాద్ అక్కడి ఆర్వోకు ఫోన్ చేసి మాట్లాడారు. ఈ నేపథ్యంలో టీడీపీ ఏజెంట్లు ఎలక్షన్ ఆఫీసర్ తో తీవ్ర వాగ్వాదానికి దిగారు. అయినా సరే.. ఆయన వాలంటీర్ ఏజెంట్ గా ఉండొచ్చని చెప్పడంతో టీడీపీ అభ్యర్థి ఈ విషయాన్ని కలెక్టర్ కు ఫిర్యాదు చేశారు.
పూర్తిగా చదవండి..AP Elections 2024: వాలంటీర్ ఏజెంట్.. శ్రీకాకుళం జిల్లాలో గందరగోళం..
ఏపీలో ఎన్నికల వేళ శ్రీకాకుళం జిల్లా కిష్టప్ప పేట పోలింగ్ బూత్ లో వివాదం చోటుచేసుకుంది. వాలంటీర్ ను వైసీపీ ఏజెంట్ గా నియమించడంతో టీడీపీ ఏజెంట్లు అభ్యంతరం వ్యక్తం చేశారు. అక్కడి పీవో అభ్యంతరాన్ని తోసిపుచ్చడంతో టీడీపీ అభ్యర్థి కలెక్టర్ కు ఫిర్యాదు చేశారు.
Translate this News: