NEET: నీట్ పీజీ పరీక్ష వాయిదా..
రేపు జరగాల్సిన నీట్ పీజీ పరీక్ష వాయిదా పడింది. మళ్ళీ ఎప్పుడు నిర్వహిస్తామ్నది త్వరలోనే ప్రకటిస్తామని ఎన్టీయే తెలిపింది.
రేపు జరగాల్సిన నీట్ పీజీ పరీక్ష వాయిదా పడింది. మళ్ళీ ఎప్పుడు నిర్వహిస్తామ్నది త్వరలోనే ప్రకటిస్తామని ఎన్టీయే తెలిపింది.
చీరాల మండలం ఈపూరుపాలెంలో జరిగిన హత్యాచార ఘటనలో ముగ్గురిని అరెస్టు చేసినట్లు ఎస్పీ జిందాల్ తెలిపారు. గంజాయి మత్తులో ఈపూరుపాలెంకు చెందిన దేవరకొండ విజయ్, దేవరకొండ శ్రీకాంత్, కారంకి మహేష్ శుక్రవారం తెల్లవారుజామున బహిర్భూమికి వచ్చిన బాధితురాలిపై అత్యాచారం చేసి హత్య చేశారన్నారు.
తాడేపల్లిలో వైసీపీ ఆఫీస్ ను కూల్చివేయడం కక్షసాధింపు చర్య అని రాజమండ్రి మాజీ ఎంపీ మార్గాని భరత్ ప్రభుత్వంపై ఫైర్ అయ్యారు. ప్రజలు ఈ విషయాన్ని గమనించాలన్నారు. వైసీపీ ఆఫీస్ కూల్చివేతపై ఆర్టీవీకి ఆయన ఇచ్చిన ఇంటర్వ్యూను ఈ వీడియోలో చూడండి.
ఏపీలో కాలుష్య నియంత్రణకు స్పెషల్ ఆడిట్ నిర్వహించాలని అధికారులను డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆదేశించారు. జిల్లాల వారీగా జల, వాయు కాల్యుష్యాలకు సంబంధించిన వివరాలు అందించాలన్నారు. ఎర్రచంద్రం అక్రమ రవాణాను అరికట్టడానికి టాస్క్ ఫోర్స్ ను బలోపేతం చేస్తామన్నారు.
చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యంను సీఎం రేవంత్ రెడ్డి పరామర్శించారు. ధైర్యం చెప్పి పిల్లలను, కుటుంబ సభ్యులను ఓదార్చారు. అనారోగ్య కారణాలతో ఆత్మహత్యకు పాల్పడిన ఎమ్మెల్యే సతీమణి రూపాదేవి చిత్రపటానికి సీఎం రేవంత్ రెడ్డి పూలమాల వేసి నివాళులర్పించారు.
భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి తాను విద్యను అభ్యసించిన నల్గొండలోని ఆల్ఫోన్స్ స్కూల్ ను సందర్శించారు. తనకు 2-8వ తరగతి వరకు క్లాస్ టీచర్ గా పని చేసిన టీచర్ కేథరిన్, హిందీ టీచర్ గులాం జిలానిని ఎంపీ సన్మానించారు. స్కూల్ లోని మధుర అనుభూతులను గుర్తు చేసుకున్నారు.
గత నెలలోనే వైసీపీ అక్రమంగా చేపట్టిన ఆఫీసు నిర్మాణంపై అధికారులు నోటీసులు ఇచ్చారని ప్రభుత్వం తెలిపింది. ఆ నోటీసును పట్టించుకోకపోవడంతో ఈ నెల 10న మరోసారి నోటీసులు ఇచ్చారని వెల్లడించింది. అయినా.. స్పందన లేకపోవడంతో కూల్చివేతకు ఆదేశాలు జారీ చేసినట్లు స్పష్టం చేసింది.
తెలంగాణ ఆర్థిక మంత్రి మల్లు భట్టి విక్రమార్క, ఏపీ ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ ఈ రోజు ఢిల్లీలో కలుసుకున్నారు. చేయి చేయి కలిపి కాసేపు ముచ్చటించారు. ఢిల్లీలో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన జరిగిన ఫైనాన్స్ మినిస్టర్ల సమావేశంలో వీరిద్దరు కలుసుకున్నారు.