ఏపీలో వర్షాలే వర్షాలు
సోమవారం నుంచి ఏపీకి వర్షాల ముప్పు రాబోతుంది. రేపటి నుంచి రాష్ట్రంలో రుతుపవనాలు విస్తరిస్తాయని, నేడు-రేపు ఎండల తీవ్రత తప్పదని, రాష్ట్రంలో 42 నుంచి 44 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతాయని వాతావరణ శాఖ వెల్లడి.
సోమవారం నుంచి ఏపీకి వర్షాల ముప్పు రాబోతుంది. రేపటి నుంచి రాష్ట్రంలో రుతుపవనాలు విస్తరిస్తాయని, నేడు-రేపు ఎండల తీవ్రత తప్పదని, రాష్ట్రంలో 42 నుంచి 44 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతాయని వాతావరణ శాఖ వెల్లడి.
అసోం రాష్ట్రాన్ని వరదలు వణికిస్తున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీవర్షాల కారణంగా నదులు పొంగి ప్రవహిస్తుండటంతో అసోం అతలాకుతలమైంది. బ్రహ్మపుత్రతోపాటు పలు నదులు ప్రమాదస్థాయికి మించి ప్రవహిస్తున్నాయి. వందలాది గ్రామాలు నీట మునిగాయి.
అంతరిక్ష ప్రయోగంలో తొలిసారిగా ఒకే రాకెట్లో అత్యధిక ఉపగ్రహాలను నింగిలోకి పంపి తన పాత రికార్డును, తానే బ్రేక్ చేసింది చైనా.. ఒకే ప్రయోగంలో 41 శాటిలైట్లను ప్రవేశపెట్టి సరికొత్త రికార్డుకు నాంది పలికింది. అంతరిక్ష ప్రయోగాలను ముందుకు తీసుకువెళ్లడానికి చైనా మూడవ విడత ప్రయోగంలో భాగంగా జిమ్ హైపింగ్, జి యాంగ్ జ్యూ అనే ఇద్దరు వ్యోమగాములతో పాటు పౌర వ్యోమగామి గుయ్ హైవ చావో అనే వ్యక్తిని ఐదు నెలలు అక్కడ ఉంచనుంది.
బాపట్ల10వ తరగతి విద్యార్థి సజీవ దహనం కేసులో అసలు విషయాలు బయటకు వచ్చాయి. తన సోదరిని వేధిస్తుండడంతో నిలదీసిన బాలుడిని, స్నేహితులతో కలిసి నిన్న ట్యూషన్ నుంచి వస్తుండగా కొట్టి, కాళ్లు కట్టేసి పెట్రోలు పోసి నిప్పు పెట్టిన నిందితుడు వెంకటేశ్వర్‌రెడ్డి.
సోషల్‌మీడియా వచ్చిన దగ్గరునుండి ప్రతి విషయం సెకండ్లలో తెలిసిపోతోంది. కొన్ని మంచి విషయాలు అయితే.. మరికొన్ని పనికిరాని విషయాలనే చెప్పాలి. సోషల్ మీడియాలో కొందరు ఆకతాయిలు అకృత్యాలు అంతాఇంతాకాదు. ఇక్కడ ఓ యువకుడు సోషల్‌మీడియాలో సీఎంపై చేసిన పోస్ట్ ప్రస్తుతం హాట్ టాఫిక్‌గా మారింది. ఇంతకీ ఏం పోస్ట్ చేశాడో తెలుసా...?
టీకాంగ్రెస్‌కు కర్నాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ఇన్ఛార్జిగా రాబోతున్నారన్న ప్రచారం ఉత్కంఠ రేపుతోంది. కర్నాటకలో కాంగ్రెస్ పార్టీని గెలిపించిన డీకే అయితేనే తెలంగాణలోనూ పార్టీకి మంచి జరుగుతుందనే అంచనాలకు వచ్చింది టీకాంగ్రెస్. సీఎం కేసీఆర్ వ్యూహాలను అన్ని రకాలుగా ఎదుర్కోవాలంటే డీకేనే సరైనా వ్యక్తి అనే వాదనలు వినిపిస్తున్నాయి. రేవంత్‌రెడ్డి వర్గం వారు డీకేకు అనుకూలంగా ఉన్నట్లు తెలుస్తోంది.
కోడి ముందా? గుడ్డు ముందా? అంటే ఇన్నాళ్లు మన దగ్గర సమాధానం లేదు. కానీ, బ్రిస్టల్ యూనివర్సిటీ దీనికి ఆన్సర్ చెప్పేసింది. తాజా అధ్యయనంలో కోడే ముందని తేలిపోయింది. సరీసృపాలు, పక్షులు, క్షీరదలు మొదట గుడ్లు పెట్టడానికి బదులుగా పిల్లలకు జన్మనిచ్చాయని పరిశోధకులు తేల్చారు. 51 శిలాజ జాతులు, 29 జీవ జాతులపై ఈ అధ్యయనం చేశారు.
కొంతమంది జనాలు ఏదైనా ఫ్రీగా... వచ్చిందంటే చాలు... ఎనుక ముందు ఏం మాత్రం ఆలోచించకుండా వెళ్తుంటారు. దాని వెనుకాల ఏం పరిణామాలు ఉండబోతాయన్న విషయాన్ని మరిచిపోయి తొందరపడుతుంటారు. అచ్చం అలాంటిదే ఇక్కడ జరిగింది. రూపాయి బిర్యాని కోసం పోతే.. పోలీసులు చలాన్లు వేసి ఇంటికి పంపించారు. ఇంతకీ ఇదెక్కడ జరిగిందంటే....
పొంగులేటి, జూపల్లి ఫిక్స్ అయ్యారు. కాంగ్రెస్ లోనే చేరాలని డిసైడ్ చేసుకున్నారు. రాహుల్ గాంధీతో జూమ్ మీటింగ్ తర్వాత ఇద్దరు నేతలు హస్తం గూటికి చేరాలని నిర్ణయం తీసుకున్నట్టు వార్తలు వస్తున్నాయి. జూన్ 22న ముహూర్తం కూడా ఫిక్స్ చేసుకున్నారని టాక్.