ఏపీలో వర్షాలే వర్షాలు

సోమవారం నుంచి ఏపీకి వర్షాల ముప్పు రాబోతుంది. రేపటి నుంచి రాష్ట్రంలో రుతుపవనాలు విస్తరిస్తాయని, నేడు-రేపు ఎండల తీవ్రత తప్పదని, రాష్ట్రంలో 42 నుంచి 44 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతాయని వాతావరణ శాఖ వెల్లడి.

New Update
ఏపీలో వర్షాలే వర్షాలు

publive-image

భారీ వర్షాలు కురిసే అవకాశం

ఆంధ్రప్రదేశ్‌లో ఎండల తీవ్రత మరో రెండు రోజులేనని, ఆ తర్వాత రాష్ట్రమంతటా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. నైరుతి రుతుపవనాలు ప్రవేశించినా ఏపీలో ఎండల తీవ్రత మాత్రం తగ్గలేదని, దీనికి కారణం రుతుపవనాలు విస్తరించకపోవడమేనని తెలిపింది. తాజాగా ఈ నెల 18 నుంచి 21 వరకు రుతుపవనాలు రాష్ట్రమంతటా విస్తరిస్తాయని, దీంతో వర్షాలు కురుస్తాయని వివరించింది. ఈ నెల 19 నుంచి అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి, శ్రీ సత్యసాయి, వైఎస్సార్ జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, అలాగే ఇంకొన్ని చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.

అధిక ఉష్ణోగ్రతలు

కోస్తాంద్రలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. గంటకు 30-40 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీస్తాయని వివరించారు. శని, ఆది వారాల్లో రాష్ట్రంలో అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయని హెచ్చరించారు. పలుచోట్ల ఉష్ణోగ్రతలు 42-44 డిగ్రీలు నమోదవుతాయని, జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచించారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు