AP: శ్రీశైలంలో చిరుత పులి కలకలం.. దేవస్థానం ఏఈఓ ఇంటి వద్ద..
శ్రీశైలంలో చిరుత సంచారం కలకలం రేపింది. దేవస్థానం ఏఈఓ మోహన్ ఇంటి వెనుక చిరుత సంచరించింది. ఇంటి ప్రహరీ గోడపై నడుచుకుంటూ వచ్చి కుక్కను ఎత్తుకెళ్లిన దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. చిరుతపులి సంచారంతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు.