MLC Kavitha: అలా ఎందుకు చేశారు.. మాజీ ఎమ్మెల్యేలపై కవిత ఫైర్..
పార్టీ కార్యకర్తలను అధిష్ఠాన నేతలు కలవకుండా కొందరు నేతలు అడ్డుపడ్డారంటూ మాజీ ఎమ్మెల్యేలపై ఎమ్మెల్సీ కవిత ఆగ్రహం వ్యక్తం చేశారు. నిజామాబాద్ లోక్సభ సమీక్ష సమావేశంలో ఆమె మాట్లాడారు. తాను స్వయంగా కార్యకర్తలను కలిసేందుకు వస్తే రకరకాల అడ్డంకులు సృష్టించారంటూ మండిపడ్డారు.