Nizamabad : అల్లుడి మీద కోపం.. వియ్యంకుడిని నరికి చంపిన వ్యక్తి!

కూతురును అన్యాయంగా పొట్టనపెట్టుకున్న అల్లుడిని చంపేందుకు వెళ్లిన వ్యక్తి అడ్డొచ్చిన వియ్యంకుడిని పట్టపగలే నరికి చంపిన ఘటన నిజమాబాద్ జిల్లాలో చోటుచేసుకుంది. కూతరు భవిత అల్లుడు గోవర్ధన్ కారణంగానే చనిపోయిందని కోపంతో రగిలిపోయిన సత్యనారాయణ వియ్యంకుడు నరహరిని హతమార్చాడు. 

New Update
Wife Murder: అనుమానంతో భార్యను కడతేర్చిన భర్త

Nizamabad :అల్లుడి మీద కోపంతో వియ్యంకుడిని పట్టపగలే ఓ వ్యక్తి నరికి చంపిన ఘటన నిజామాబాద్ జిల్లాలో కలకలం రేపింది. తన కూతురిని టార్చర్ చేసి  పొట్టనపెట్టుకున్నారనే కోపంతో రగిలిపోయిన పిల్ల తండ్రి అల్లుడుని చంపేందుకు వెళ్లి అతని తండ్రిని దారుణంగా హతమార్చాడు. ఈ ఘటన మెపాల్ మండలం కంజర గ్రామంలో గురువారం చోటుచేసుకోగా వివరాలు ఇలా ఉన్నాయి.

  కుటుంబ గొడవలతో భవిత ఆత్మహత్య..

ఈ మేరకు కంజర గ్రామానికి చెందిన గోవర్ధన్, భవితకు కొంతకాలం క్రితం పెళ్లి జరిగింది. అయితే కుటుంబ గొడవలతో భవిత ఇటీవల ఆత్మహత్య చేసుకుంది. అయితే తన కూతురు చావుకు అల్లుడు గోవర్ధన్ కారణంగా భావించిన భవిత తండ్రి సత్యనారాయణ కోపంతో రగిలిపోతున్నాడు. ఈ క్రమంలోనే గురువారం ఉదయం గోవర్ధన్ ఇంటికి వచ్చిన సత్యనారాయణ.. అల్లుడు గోవర్ధన్ కోసం వెతకడంతో కనిపించలేదు. దీంతో సత్యనారాయణకు గోవర్ధన్ తండ్రి నచ్చజెప్పేందుకు ప్రయత్నించాడు. కానీ ఆవేశంలో ఉన్న సత్యనారాయణ.. గోవర్ధన్ తండ్రి నరహరిని తాను తెచ్చుకున్న కత్తితో పట్టపగలే నరికి హతమార్చాడు. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. పరారిలో ఉన్న నిందితుడు సత్యనారాయణ కోసం గాలిస్తున్నట్లు తెలిపారు. 

Also Read :  శృంగారం, డ్రగ్స్, బ్లాక్ మెయిల్స్.. కంపుకొడుతున్న తెలుగు ఇండస్ట్రీ!

Advertisment
తాజా కథనాలు