Telangana: తాగి బయటకొచ్చారో తాట తీసుడే.. పోలీసుల మాస్ వార్నింగ్..
న్యూఇయర్ సెలబ్రేషన్స్పై నజర్ పెట్టారు హైదరాబాద్ పోలీసులు. ఎవరైనా తాగి డ్రైవింగ్ చేస్తే తాట తీస్తామని హెచ్చరిస్తున్నారు సైబరాబాద్ సీపీ అవినాష్. రాత్రి 8 గంటల నుంచే డ్రంక్ అండ్ డ్రైవ్, డ్రగ్ డిటెక్షన్ టెస్టులు చేస్తామన్నారు. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు.