NEET PG Exam : నీట్ పీజీ పరీక్ష తేదీ ఖరారు.. ! ఎప్పుడంటే
ఆగస్టు 11న నీట్ పీజీ పరీక్ష జరగనుంది. రెండు షిఫ్టుల్లో ఈ పరీక్ష నిర్వహించనున్నారు. ఈ మేరకు నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఇన్ మెడికల్ సైన్సెస్ (NBEMS) ఉత్తర్వులు జారీ చేసింది.
ఆగస్టు 11న నీట్ పీజీ పరీక్ష జరగనుంది. రెండు షిఫ్టుల్లో ఈ పరీక్ష నిర్వహించనున్నారు. ఈ మేరకు నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఇన్ మెడికల్ సైన్సెస్ (NBEMS) ఉత్తర్వులు జారీ చేసింది.
నీట్ పేపర్ లీకేజీ తర్వాత పరీక్షను మరోసారి నిర్వహించాలని కోరుతూ సుప్రీంకోర్టులో 26 పిటిషన్లు దాఖలయ్యాయి. జులై 8న దీనిపై విచారణ చేయనుంది. ఈ నేపథ్యంలోనే నీట్లో మంచి ర్యాంక్ సాధించిన 56 మంది విద్యార్ధులు పరీక్ష రద్దు చేయొద్దంటూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు.
నీట్ పేపర్ లీక్ విషయంలో మరో ఇద్దరిని అరెస్ట్ చేసింది సీబీఐ. జార్ఖండ్ రాష్ట్రం హజారీబాగ్‌లోని ఒయాసిస్ స్కూల్ ప్రిన్సిపాల్ ఎహ్సాన్ ఉల్ హక్, సెంటర్ సూపరింటెండెంట్ ఇంతియాజ్‌లను అదుపులోకి తీసుకుంది.
NEET నుంచి తమ రాష్ట్రాన్ని మినహాయించాలని తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ కేంద్రాన్ని కోరారు. వైద్య విద్యలో ప్రవేశాల కోసం దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న ఈ పరీక్ష వివక్షతో కూడుకున్నదన్నారు. దీనిపై అసెంబ్లీలో శుక్రవారం ఏకగ్రీవ తీర్మానాన్ని ఆమోదించారు.
దేశంలో పేపర్ లీక్‌ల ఘటన విద్యావ్యవస్థలు, ప్రభుత్వ తీరును ప్రశ్నిస్తున్నాయి. గత ఏడేళ్లలో మొత్తం 70 పేపర్ లీక్ అయిన ఘటనలు చోటుచేసుకున్నాయి. కొందరు అధికారుల నిర్లక్ష్యం విద్యార్థుల జీవితాలను అంధకారంలోకి నెట్టేస్తోంది.
నీట్, యూజీసీ-నెట్ పరీక్షల్లో జరిగిన అవకతవకలపై దేశవ్యాప్తంగా దుమారం రేపుతున్న వేళ.. ప్రభుత్వ పరీక్షల చట్టం-2024 ను తాజాగా కేంద్రం అమల్లోకి తెచ్చింది. దీనిప్రకారం పరీక్షలో అక్రమాలకు పాల్పడ్డవారికి రూ.కోటీ జరిమానా, పదేళ్ల జైలు శిక్ష విధించనున్నారు.
నీట్ పేపర్ లీక్‌పై దేశవ్యాప్తంగా దుమారం రేపుతుండగా.. అనురాగ్ యాదవ్ తనకు క్వశ్చన్ పేపర్ లీక్ అయిందని చెప్పడం సంచలనం రేపింది. తన అంకుల్ ఇచ్చిన పేపర్.. పరీక్షలో వచ్చిన పేపర్ మ్యాచ్ అయ్యిందని తెలిపాడు. అయినప్పటికీ అతడికి 720 మార్కులకు185 మార్కులే రావడం గమనార్హం.
యూజీసీ నెట్ పరీక్షను రద్దు చేసిన విషయం తెలిసిందే. డార్క్ వెబ్‌లో పరీక్ష ప్రశ్నాపత్రం లీక్ అయినట్లు గుర్తించారు. దీనిపై సీబీఐ విచారణ చేపట్టింది. ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. మరోవైపు నీట్ వ్యవహారం సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది.
నీట్ పరీక్ష నిర్వహణలో అక్రమాలు బయటపడటం విద్యార్థులు భవిష్త్యత్తు ఏంటీ అనేది ప్రశ్నార్థకంగా మారింది . ఓవైపు నీట్ పరీక్షను రద్దు చేయాలని డిమాండ్లు వస్తున్నాయి. ప్రధాని మోదీ దీనిపై స్పందించాలని పలువురు నిపుణలు తమ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.