Maoists : పవన్‌కు మావోయిస్టుల ముప్పు! AP: పవన్ కళ్యాణ్ భద్రతపై కేంద్ర నిఘా వర్గాలు వార్నింగ్ ఇచ్చాయి. అప్రమత్తంగా ఉండాలంటూ పవన్‌కు సూచనలు చేసింది. కళ్యాణ్‌ను కొన్ని గ్రూపులు టార్గెట్ చేశాయని కేంద్ర నిఘా వర్గాలు పేర్కొన్నాయి. గతంలో పవన్ తీరును తప్పుబడుతూ మావోయిస్టుల ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. By V.J Reddy 20 Jul 2024 in ఆంధ్రప్రదేశ్ Latest News In Telugu New Update షేర్ చేయండి CIA Have Warned About Pawan Kalyan Security : ఏపీ డిప్యూటీ సీఎం పవన్ భద్రతపై కేంద్ర నిఘా వర్గాలు వార్నింగ్ ఇచ్చాయి. జాగ్రత్తగా ఉండాలంటూ పవన్‌కు కేంద్రం నుంచి సూచనలు ఇచ్చాయి. పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ను కొన్ని గ్రూపులు టార్గెట్ చేశాయని కేంద్ర నిఘా వర్గాలకు సమాచారం అందింది. నిఘా వర్గాల రెగ్యులర్ చెకప్స్‌లో కొన్ని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఎన్డీఏ (NDA) లో జనసేన కీలకంగా ఉండటం బీజేపీ (BJP) కి పవన్ మద్దతు ఇస్తున్న నేపథ్యంలోనే అలర్ట్ చేసింది. పవన్ తీరును తప్పుబడుతూ గతంలో మావోయిస్టుల ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పవన్ కళ్యణ్ కు భద్రత పెంచే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. సీఎం చంద్రబాబు (CM Chandrababu) కు కేటాయించినట్లు బ్లాక్ క్యాట్ కమెండోస్ Z+ సెక్యూరిటీని పవన్ కళ్యాణ్ కు కేటాయించనున్నట్లు సమాచారం. పవన్ సెక్యూరిటీ పై అధికారులు సమావేశమై.. తుది నిర్ణయం తీసుకోనున్నట్లు అధికారిక వర్గాలు తెలిపాయి. Also Read : అల్లకల్లోలంగా చిక్కోలు తీరం.. ఉవ్వెత్తున ఎగసి పడుతున్న అలలు..! #pawan-kalyan #cia #nda #bjp మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి Advertisment సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి