AP News: టీడీపీలో చేరిన హీరో నిఖిల్..!
సినీహీరో నిఖిల్ టీడీపీలో చేరారు. ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఆధ్వర్యంలో సైకిల్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా నారా లోకేష్ కండువా కప్పి నిఖిల్ ను పార్టీలోకి ఆహ్వానించారు.
సినీహీరో నిఖిల్ టీడీపీలో చేరారు. ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఆధ్వర్యంలో సైకిల్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా నారా లోకేష్ కండువా కప్పి నిఖిల్ ను పార్టీలోకి ఆహ్వానించారు.
కారంపూడి సీఐ చిన్న మల్లయ్యని సస్పెండ్ చేయాలని నారా లోకేశ్ డిమాండ్ చేశారు. సన్నగండ్ల టీడీపీ నేత చప్పిడి రాముపై గన్ ఎత్తిన సీఐ చిన్న మల్లయ్యపై ఎన్నికల సంఘం విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
ఓటమి భయంతో వైసీపీ నాయకులు టీడీపీ ముఖ్యనేతలపై దాడికి దిగుతున్నారని లోకేష్ మండిపడ్డారు. జగన్ గొడ్డలితో తెగబడితే, వైసీపీ కార్యకర్తలు వేటకొడవళ్లతో జనాల్ని వేటాడుతున్నారని ఫైర్ అయ్యారు. దాడి చేసే నాయకులందరినీ గుర్తుపెట్టుకుంటామని హెచ్చరించారు.
ఎన్నికల కోడ్ పేరిట మూడు రోజుల్లో తన కారును నాలుగు సార్లు తనిఖీలు చేసిన పోలీసులపై టీడీపీ నేత లోకేశ్ ఫైర్ అయ్యారు. ఎన్నిసార్లు ఆపుతారని ప్రశ్నించారు. డీజీపీని తమాషాలు ఆడొద్దని హెచ్చరించారు. వైసీపీ నేతలను ఇలానే ఆపుతున్నారా అని నిలదీశారు లోకేశ్.
ఓటమి భయంతో మునయ్యని వైసీపీ సైకోలు మట్టుబెట్టారని ఆరోపించారు లోకేష్. గిద్దలూరు మండలం గడికోట పంచాయతీకి చెందిన పాముల మునయ్య టిడిపిలో చేరిన రోజే చంపేస్తామని హెచ్చరించారని అన్నారు. బాబాయ్‌పై అబ్బాయి గొడ్డలి వేటేసి అధికారం దక్కించుకున్నాడని సీఎం జగన్‌ను ఉద్దేశిస్తూ విమర్శలు చేశారు.
ఉండవల్లి కరకట్ట వద్ద నారా లోకేష్ కాన్వాయ్ ను పోలీసులు తనిఖీ చేశారు. ఎన్నికల కోడ్ అమలులో భాగంగా తనిఖీలు చేస్తున్నట్లు వెల్లడించారు. ఇదిలా ఉండగా మంగళగిరిలో లక్షా 80 వేల మానిఫెస్టో కాపీలను లోకేష్ ఇంటింటికి పంపిణి చేయడానికి ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది.
ఏపీ ఎన్నికల బరిలో ఈ సారి ఏకంగా ఐదుగురు మాజీ సీఎంల కుమారులు బరిలో నిలవడం ఆసక్తికరంగా మారింది. వైఎస్, ఎన్టీఆర్, చంద్రబాబు, నాందెడ్ల భాస్కర్ రావు, కోట్ల విజయభాస్కర్ రెడ్డి తనయులు ఈ ఎన్నికల్లో ఎమ్మెల్యేలుగా పోటీ చేస్తున్నారు.
2018 గ్రూప్-1 మెయిన్స్ పరీక్షను హైకోర్టు రద్దు చేయడంపై స్పందించారు లోకేష్. APPSCని భ్రష్టు పట్టించిన జగన్‌కి హైకోర్టు తీర్పు చెంపపెట్టు అని అన్నారు. త్వరలో ప్రజా ప్రభుత్వం ఏర్పడుతుందని.. కోర్టు ఆదేశాల మేరకు పారదర్శకంగా ప్రభుత్వ ఉద్యోగాలన్నీ భర్తీ చేస్తామన్నారు.
వైసీపీ సర్కారుపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ మరోసారి మండిపడ్డారు. జగన్ పాలనలో సీమ ప్రజల బతుకు ఛిద్రం అయిందని పేర్కొన్నారు. జగన్ మోహన్ రెడ్డిది దరిద్ర పాదమని విమర్శించారు. అనంతపురం జిల్లా ప్రజలు తీవ్ర దుర్భిక్ష పరిస్థితులను ఎదుర్కొంటున్నారంటూ ఫొటో షేర్ చేశారు.