Nagarjuna Sagar: రెండేళ్ల తరువాత.. నాగార్జున సాగర్ 20 గేట్లు ఎత్తివేత
నాగార్జున సాగర్‌కు వరద కొనసాగుతోంది. 20 గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేశారు అధికారులు. 4 గేట్లు 5 ఫీట్లు, 16 గేట్లను 10 ఫీట్లు పైకెత్తి దిగువకు నీరు విడుదల చేశారు. ఇన్‌ఫ్లో 3,00,530 క్యూసెక్కులు.. ఔట్ ఫ్లో 2,54,460 క్యూసెక్కులుగా కొనసాగుతోంది.