MLC Kavitha: ఎమ్మెల్సీ కవితకు బిగ్ షాక్
TG: లిక్కర్ స్కాం కేసులో ఎమ్మెల్సీ కవితకు కోర్టు షాకిచ్చింది. జూన్ 21 వరకు ఆమె జ్యూడిషియల్ కస్టడీని పొడిగించింది. తనకు జైల్లో చదువుకోవడానికి 9 పుస్తకాలు అడగగా.. కోర్టు అందుకు అనుమతించింది.
TG: లిక్కర్ స్కాం కేసులో ఎమ్మెల్సీ కవితకు కోర్టు షాకిచ్చింది. జూన్ 21 వరకు ఆమె జ్యూడిషియల్ కస్టడీని పొడిగించింది. తనకు జైల్లో చదువుకోవడానికి 9 పుస్తకాలు అడగగా.. కోర్టు అందుకు అనుమతించింది.
లిక్కర్ స్కాం కేసులో ఎమ్మెల్సీ కవితకు బిగ్ షాక్ తగిలింది. కవితపై అనుబంధ చార్జిషీట్ దాఖలు చేసింది ఈడీ. కవితపై ఈడీ దాఖలు చేసిన ఛార్జిషీట్ను పరిగణనలోకి తీసుకున్న రౌస్ అవెన్యూ కోర్టు.. జూన్ 3న అనుబంధ చార్జిషీట్ లో ఉన్న నిందితులందరు కోర్టుకు రావాలని సమన్లు జారీ చేసింది.
ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఈడీ సంచలన విషయాలు బయటపెట్టింది. ఈ స్కాం గురించి కేసీఆర్కు ముందే తెలుసని వెల్లడించింది. మద్యం వ్యాపారుల వివరాలు కవిత నేరుగా కేసీఆర్కు చెప్పిన్నట్లు ఆధారాలు లభించాయని, టీం సభ్యులను కేసీఆర్ కు కవిత పరిచయం చేసిందని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ తెలిపింది.
నేడు కవిత బెయిల్ పిటిషన్పై ఢిల్లీ హైకోర్టు విచారణలో జరగనుంది. కవితకు బెయిల్ వస్తుందా? రాదా? అనే ఉత్కంఠ నెలకొంది. హైకోర్టులో బెయిల్ రాకపోతే కవిత సుప్రీంకోర్టుకు వెళ్తారని తెలుస్తోంది. PMLA సెక్షన్ 45 ప్రకారం బెయిల్ పొందేందుకు తాను అర్హురాలునని కవిత పిటిషన్లో పేర్కొన్నారు.
కవిత బెయిల్ పిటిషన్పై విచారణ జరిపిన ఢిల్లీ హైకోర్టు.. తదుపరి విచారణను మళ్లీ సోమవారానికి వాయిదా వేసింది.
TG: ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో అరెస్టై తీహార్ జైలులో ఉన్న ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్పై ఇవాళ ఢిల్లీ హైకోర్టులో విచారణ జరగనుంది. కాగా ఎమ్మెల్సీ కవిత బెయిల్ పై బీఆర్ఎస్ శ్రేణుల్లో ఉత్కంఠ నెలకొంది.
TG: ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఎమ్మెల్సీ కవితకు ఈడీ మరో షాక్ ఇచ్చింది. ఆమెతో పాటి మరో నలుగురిపై సప్లిమెంటరీ ఛార్జిషీట్ దాఖలు చేసింది. దీనిపై విచారించిన ఢిల్లీ కోర్టు తీర్పు రిజర్వ్ చేసింది. మే 29న తుది తీర్పు ఇవ్వనున్నట్టు తెలిపింది.
ఎమ్మెల్సీ కవిత జ్యుడీషియల్ రిమాండ్ ను రౌస్ అవెన్యూ కోర్టు జూన్ 3 వరకు పొడిగించింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కు సంబంధించి సీబీఐ నమోదు చేసిన కేసులో ఈ నిర్ణయం తీసుకుంది. మరో వైపు ఈ నెల 24న ఢిల్లీ హైకోర్టులో సీబీఐ, ఈడీ బెయిల్ పిటిషన్లపై విచారణ జరగనుంది.
TG: లిక్కర్ స్కాం కేసులో అరెస్టై తీహార్ జైలులో ఉన్న ఎమ్మెల్సీ కవితతో బీఆర్ఎస్ నేతలు ములాఖత్ అయ్యారు. బీఆర్ఎస్ నాయకులు ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్, మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ కవితను కలిశారు. కాగా లిక్కర్ స్కాం కేసులో కవితను మార్చి 15న ఈడీ అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.