Liquor scam: ఢిల్లీ లిక్కర్ స్కాంలో కేసీఆర్.. ఈడీ సంచలనం! ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఈడీ సంచలన విషయాలు బయటపెట్టింది. ఈ స్కాం గురించి కేసీఆర్‌కు ముందే తెలుసని వెల్లడించింది. మద్యం వ్యాపారుల వివరాలు కవిత నేరుగా కేసీఆర్‌కు చెప్పిన్నట్లు ఆధారాలు లభించాయని, టీం సభ్యులను కేసీఆర్ కు కవిత పరిచయం చేసిందని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ తెలిపింది. By srinivas 28 May 2024 in క్రైం తెలంగాణ New Update షేర్ చేయండి KCR in Delhi Liquor Scam: ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఈడీ (ED) సంచలన విషయాలు బయటపెట్టింది. ఈ స్కాం గురించి కేసీఆర్‌కు ముందే తెలుసని వెల్లడించింది. మద్యం వ్యాపారుల వివరాలు కవిత (MLC Kavitha) నేరుగా కేసీఆర్‌కు చెప్పిన్నట్లు ఆధారాలు లభించాయని, కేసీఆర్ కు తన ఢిల్లీ నివాసంలో టీం సభ్యులను కవిత పరిచయం చేసిందని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ తెలిపింది. మద్యం వ్యాపారం వివరాలను వారి నుంచి కేసీఆర్ అడిగి తెలుసుకున్నారని పేర్కొంది. దీంతో లిక్కర్ స్కాంలో కేసీఆర్ పాత్ర ఉందా అనే కోణంలో ఈడీ విచారణ చేపట్టనుండగా.. కేసీఆర్ పాత్రపై సీబీఐ (CBI) ఆరాతీయనున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఈ లిక్కర్ స్కాం కేసీఆర్ మెడుకు చుట్టుకుంటుందేమోనని బీఆర్ఎస్ శ్రేణుల్లో ఆందోళన మొదలైంది. నిజంగానే కేసీఆర్ కు ఈ ఇష్యూతో సంబంధాలుంటే అరెస్ట్ అయ్యే అవకాశాలుంటాయా? ఈడీ, కేంద్ర ప్రభుత్వం దీనిపై ఎలాంటి యాక్షన్ తీసుకోబోతుందనే అంశం కూడా చర్చనీయాంశమైంది. ఇక కవిత బెయిల్ పిటిషన్‌పై నిన్న ఢిల్లీ హైకోర్టులో కవిత తరఫున వాదనలు వినిపించారు న్యాయవాది విక్రమ్ చౌదరి. అయితే కవితకు ఎట్టి పరిస్థితుల్లో బెయిల్ ఇవ్వొద్దని కోరింది ఈడీ. ఇక ఇప్పటికే ఈ కేసులో ఢిల్లీ సర్కారుకు సంబంధించి సీఎం కేజ్రీవాల్, డిప్యుటీ సీఎం మనీష్ సిసోడియాతో పాటు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను జైలుకు పంపింది ఈడీ. తాజాగా ఈ కేసుకు సంబంధించి కొత్త విషయాలను ఢిల్లీ హైకోర్టు దృష్టికి తీసుకెళ్లింది. ఢిల్లీ లిక్కర్ పాలసీ, రిటైల్ వ్యాపారం గురించి కవిత ముందుగానే కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లినట్లుగా వెల్లడించింది. ఈ కేసులో కేసీఆర్ పాత్ర కూడా ఉందని కోర్టుకు తెలియజేసింది. Also Read: తెలంగాణ గీతానికి కీరవాణి సంగీతం అందుకే.. ఢిల్లీలో రేవంత్ సంచలన వ్యాఖ్యలు బెయిల్ పొందే అర్హత లేదు.. ఇక ఈ కేసు మొత్తంలో ఉంది ఒక్కరే మహిళ అని ఒక మహిళగా బెయిల్ పొందే అర్హత ఉందని కవిత చెప్పిన విషయాన్ని దర్యాప్తు సంస్థలు వ్యతిరేకించాయి. కవిత ఏమి సాధారణ గృహిణి కాదని, ఒక రాష్ట్రానికి సీఎంగా పనిచేసిన వ్యక్తి కుమార్తె, విదేశాల్లో ఫైనాన్స్‌లో మాస్టర్స్ చదివి వచ్చి రాజకీయంగా ఉన్నత స్థానాలను చూశారని ఈడీ లాయర్ వివరించారు. కవిత అనేక కంపెనీల్లో భాగస్వామ్యురాలిగా ఉన్నారు. మరికొన్ని సంస్థల్లో బాధ్యతాయుతమైన పదవుల్లో ఉన్నారు. అన్నింటిలో అధీకృత సంతకం చేస్తే హోదాతో ఉన్నారు. కవిత ఎంత శక్తిమంతురాలో ఆమె సాక్షులను బెదిరించిన తీరు చూస్తే అర్ధమవుతుంది. ఆ వివరాలు అన్ని కోర్టు ముందు ఉన్నాయి. మహిళగా ప్రత్యేక పరిస్థితుల దృష్ట్య బెయిల్ మంజూరు చేయాలనే అంశాన్ని అసలు పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఈడీ కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లోనే మహిళలకు సంబంధించిన బెయిల్ ప్రత్యేకంగా తీసుకోవాలని, గతంలో ఢిల్లీ హైకోర్టు స్పష్టమైన తీర్పులు ఇచ్చిందని ప్రస్తావించింది ఈడీ. ఢిల్లీలో మద్యం వ్యాపారం చేయడం కోసం కవిత తన వద్దకు వచ్చినట్లు మాగుంట శ్రీనివాసరెడ్డి తన వాగ్మూలంలో స్పష్టం చేశారని ఈడీ గుర్తు చేసింది. #mlc-kavitha #kcr #delhi-liquor-scam #ed మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి