AP DSC: డీఎస్సీ అభ్యర్థులకు గుడ్ న్యూస్
డీఎస్సీ అభ్యర్థులకు ఏపీ ప్రభుత్వం తిపి కబురు అందించింది. డీఎస్సీ దరఖాస్తుల గడువు రేపటితో ముగియనున్న నేపథ్యంలో.. తాజాగా గడువును పెంచింది. ఈ నెల 25వ తేదీ వరకు పొడిగించింది.
డీఎస్సీ అభ్యర్థులకు ఏపీ ప్రభుత్వం తిపి కబురు అందించింది. డీఎస్సీ దరఖాస్తుల గడువు రేపటితో ముగియనున్న నేపథ్యంలో.. తాజాగా గడువును పెంచింది. ఈ నెల 25వ తేదీ వరకు పొడిగించింది.
సీఎం జగన్ పై మరోసారి విమర్శల దాడికి దిగారు ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల. మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి 52 వేల పోస్టులతో మెగా డీఎస్సీ వేస్తే... వారసుడు గా చెప్పుకొనే జగన్ అన్న 6 వేలతో వేసింది "దగా డీఎస్సీ" అని విమర్శలు చేశారు.
ఏపీలో డీఎస్సీ నోటిఫికేషన్ ను విడుదల చేశారు. ఈ నెల 12 నుంచే దరఖాస్తులను కూడా స్వీకరించనున్నారు. మొత్తం 6,100 పోస్టులను భర్తీ చేయనున్నారు. నోటిఫికేషన్ కూడా విడుదల అవ్వడంతో అభ్యర్ధులు, నిరుద్యోగులు రిలాక్స్ అవుతున్నారు. పరీక్షల ప్రిపరేషన్ కోసం సిద్ధం అవుతున్నారు.
సోమవారం నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఉదయం పది గంటలకు సమావేశాలు ప్రారంభం కానున్నాయి. త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో…ఈసారి పూర్తిస్థాయి బడ్జెట్ కాకుండా ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్నారు.
మెగా డీఎస్సీకి ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపింది. 6,100 పోస్టులను భర్తీ చేయడానికి కేబినెట్ ఓకే చెప్పింది. ఎన్నికలకు ముందు నిరుద్యోగ యువతను తమవైపునకు తిప్పుకునేందుకు జగన్ సర్కార్ మెగా డీఎస్సీ నోటిఫికేషన్ జారీ చేసినట్టుగా అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ఫిబ్రవరిలోనే మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదలకు తెలంగాణ విద్యాశాఖ కసరత్తు చేస్తోంది. గతేడాది ఆగస్టులో 5,089 ఉపాధ్యాయ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ వెలువడగా.. ఖాళీల సంఖ్యను పెంచి మెగా డీఎస్సీ చేపట్టాలని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయించింది. మరో 5 వేల ఉద్యోగాలు ఇందులో జోడించనుంది.
వచ్చే నెలలోనే మెగా డీఎస్సీకి నోటిఫికేషన్ ఇవ్వనున్నట్లు మంత్రి కోమటి రెడ్డి వెంకటరెడ్డి నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పారు. పదేళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ టీచర్ ఉద్యోగాల భర్తీకి ఒక్క నోటిఫికేషన్ ఇవ్వలేదని మండిపడ్డారు. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన వస్తుందని అన్నారు.
రేవంత్ సర్కార్ నిరుద్యోగులకు త్వరలో గుడ్ న్యూస్ చెప్పేందుకు సిద్ధమైంది. ఉపాధ్యాయ కాళీలను భర్తీ చేయడానికి డీఎస్సీ నిర్వహించేందుకు తగు చర్యలు తీసుకోవాలని అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. అలాగే ప్రతి ఊరికి ఒక బడి ఉండాలని అన్నారు.
రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కొత్త ప్రభుత్వం ఉద్యోగ నియామకాలను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఈ క్రమంలోనే మెగా డీఎస్సీ వేసేందుకు చర్యలు చేపట్టింది. ఈక్రమంలోనే డీఎస్సీపై త్వరలోనూ స్పష్టమైన ప్రకటన చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.