TS TET Exam 2024: తెలంగాణలో మెగా డీఎస్సీకి (TS DSC) కాంగ్రెస్ గవర్నమెంట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. కాగా మొత్తం 11వేలకుపైగా పోస్టులకుగానూ మార్చి 4నుంచి దరఖాస్తుల ప్రక్రియ మొదలుకానుంది. అయితే ఈ సందర్భంగా డీఎస్సీ అర్హత పరీక్ష టెట్ ఇష్యూ మరోసారి చర్చనీయాంశమైంది. జూన్ చివరి వారంలో డీఎస్సీ పరీక్షలు నిర్వహించబోతున్నట్లు తెలుస్తుండగా.. డీఎస్సీ నోటిఫికేషన్ తో సంబంధం లేకుండా టెట్ ప్రకటన ఇస్తారా? లేక అభ్యర్థుల నుంచి వస్తున్న విజ్ఞప్తులను పరిగణనలోకి తీసుకొని మెగా డీస్సీకి ముందుగానే ప్రకటన చేస్తారా? అనే విషయంపై టెట్ అభ్యర్థుల్లో ఉత్కంఠ కొనసాగుతుంది.
పూర్తిగా చదవండి..TS TET: మెగా డీఎస్సీకి ముందు టెట్ నోటిఫికేషన్? అభ్యర్థుల్లో కొనసాగుతున్న ఉత్కంఠ!
తెలంగాణలో మెగా డీఎస్సీకి ముందు టెట్ నోటిఫికేషన్ పై ఉత్కంఠ నెలకొంది. బీఈడీ, డీఎడ్ పూర్తిచేసిన అభ్యర్థులు టెట్ నిర్వహించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. తమకు డీఎస్సీ రాసే అవకాశం ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తున్నారు. దీనిపై ప్రభుత్వం త్వరలోనే కీలక ప్రకటన చేయబోతున్నట్లు తెలుస్తోంది.
Translate this News: