Accident : ఘోర రోడ్డు ప్రమాదం.. గర్భిణితో సహా శిశువు మృతి
మెదక్ జిల్లాలో బుధవారం మధ్యాహ్నం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మనోహరాబాద్ నుంచి దండుపల్లికి భార్యభర్తలు బైక్పై వెళ్తుండగా లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో ఏడునెలల గర్భిణీ అక్కడిక్కడే మృతి చెందారు. ఆమె భర్తకు తీవ్ర గాయాలయ్యాయి.