ఐదేళ్ల చిన్నారిపై హత్యాచారం.. నిందితుడికి మరణ శిక్ష

సంగారెడ్డి జిల్లా భానూర్‌లో గత ఏడాది ఓ ఐదేళ్ల చిన్నారిని అత్యాచారం చేసి హత్య చేసిన నిందితుడికి పోక్సో కోర్టు మరణ శిక్ష విధించింది. అలాగే బాధితురాలి కుటుంబానికి రూ.10 లక్షల పరిహారం ఇవ్వాలని ఆదేశించింది.

author-image
By B Aravind
New Update
Rape and murder

సంగారెడ్డి జిల్లా భానూర్‌లో గత ఏడాది ఓ ఐదేళ్ల చిన్నారిని అత్యాచారం చేసి హత్య చేసిన నిందితుడికి పోక్సో కోర్టు మరణ శిక్ష విధించింది. అలాగే బాధితురాలి కుటుంబానికి రూ.10 లక్షల పరిహారం ఇవ్వాలని ఆదేశించింది. ఇంతకీ అసలేం జరిగిందో తెలియాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే. ఇక వివరాల్లోకి వెళ్తే.. 2023 అక్టోబర్‌లో ఓ రోజున భానూర్‌లోని ఓ ప్రాంతంలో పనిచేస్తున్న ఆ చిన్నారి తాతయ్య,నానమ్మ పనిరీత్యా వేరే చోటుకి వెళ్లారు. వాళ్లతో పాటు ఉన్న ఆ చిన్నారిని మేము వచ్చే వరకు చూసుకోవాలని అక్కడున్న సెక్యూరిటీ గార్డుకు చెప్పి వెళ్లారు. దీంతో అక్కడే పనిచేస్తున్న బిహార్‌కి చెందిన గఫాఫర్ అలీ అనే ఓ కార్మికుడు వాళ్లని గమనించాడు. అప్పటికే మద్యం సేవించి ఉన్న అలీ.. ఆ సెక్యూరిటీ గార్డు నుంచి చిన్నారిని తీసుకెళ్లాడు. 

Also Read: హైదరాబాద్‌ లో విషాదం.. స్కూల్‌ వ్యాన్‌లో నుంచి జారిపడి చిన్నారి మృతి

ఆ తర్వాత మధ్యాహ్నం భోజనం చేసేందుకు ఆ ప్రాంతానికి వచ్చిన గ్రాండ్‌పేరెంట్స్‌కు తమ మనుమరాలు కనిపించలేదు. అలీ ఆమెను తీసుకెళ్లాడని ఆ సెక్యూరిటీ గార్డు చెప్పాడు. చివరికి కొన్ని గంటల తర్వాత అలీని వాళ్లు పట్టుకున్నారు. సమాచారం మేరకు ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు అలీని అదుపులోకి తీసుకున్నారు. అలీ వద్ద ఓ కత్తి ఉండటాన్ని గుర్తించారు. చివరికి అలీ ఆ చిన్నారిని హత్యాచారం చేసినట్లు ఒప్పుకున్నాడు. ఆమెకు చాక్లెట్లు, కూల్‌డ్రింక్‌లు ఇస్తానని చెప్పి తీసుకెళ్లానని.. అల్కహాల్‌ కలిపిన కూల్‌డ్రింక్‌ ఆమెకు తాగించానని చెప్పాడు. ఆ తర్వాత దగ్గర్లో ఉన్న పత్తి చేనుకి తీసుకెళ్లి అత్యాచారం చేసి.. కత్తితో హత్య చేసినట్లు అంగీకరించాడు.

దీంతో పోలీసులు అతడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి  జైలుకు తరలించారు. చివరికి దీనిపై విచారణ జరిపిన పోక్సో కోర్టు అలీకి మరణ శిక్ష విధించింది. నేరాన్ని అంగీకరించినట్లు నిందితుడు ఒప్పుకోవడం, సీసీటీవీ ఫుటేజ్‌ల ఆధారంగా నిందితుడిని కోర్టు దోషిగా నిర్ధారించింది. అలీకి మరణదండ విధిస్తూ తీర్పునిచ్చింది. అలాగే బాధితురాలి కుటుంబానికి రూ. 10 లక్షల పరిహారం ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది. ఉమ్మడి మెదక్ జిల్లాలో గత 27 ఏళ్లలో ఇలా దోషికి మరణ శిక్ష విధించడం ఇది రెండోసారి. మరోవైపు ఈ కేసును విచారించిన పోలీసులను సంగారెడ్డి జిల్లా ఎస్పీ చెన్నూరి రూపేష్‌ అభినందించారు.

Advertisment
తాజా కథనాలు