Watch Video: సెల్ఫీ తీసుకుంటుండగా 100 అడుగుల లోయలో పడ్డ యువతి.. చివరికి

మహారాష్ట్రలోని బోరాన్‌ ఘాట్‌లో నస్రీన్‌ అమీర్‌ ఖురేషీ అనే యువతి సెల్ఫీ తీసుకుంటుండగా కాలు జారీ 100 అడుగుల లోతులో ఉన్న లోయలో పడిపోయింది. వెంటనే స్పందించిన హోంగార్టు, స్థానికులు లోయలోకి దిగి ఆమెను కాపాడారు. చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.

New Update
Watch Video: సెల్ఫీ తీసుకుంటుండగా 100 అడుగుల లోయలో పడ్డ యువతి.. చివరికి

కొత్త ప్రదేశాలకు వెళ్లినప్పుడు పర్యాటకులు సాధారణంగా గ్రూప్‌ ఫొటోలు, సెల్ఫీలు తీసుకుంటారు. అయితే ఓ యువతి సెల్ఫీ తీసుకుంటుండగా ప్రమాదవశాత్తు ఏకంగా 100 అడుగుల లోయలోకి జారిపడింది. మహారాష్ట్రలోని పర్యాటక ప్రదేశమైన బోరాన్‌ ఘాట్‌లో శనివారం ఈ ఘటన జరిగింది. ఇక వివరాల్లోకి వెళ్తే.. మహారాష్ట్రలో ఇటీవల భారీ వర్షాలు కురవడంతో వాటర్‌ఫాల్స్‌ పొంగిపొర్లుతున్నాయి. దీంతో పర్యటకులు ఆయా జలపాతాలకు వెళ్తున్నారు. అయితే పుణెకు చెందిన ఓ పర్యటక బృంద బోరాన్‌ ఘాట్‌ ప్రదేశానికి వచ్చింది. ఈ టీమ్‌లో నస్రీన్‌ అమీర్‌ ఖురేషీ అనే యువతి సెల్ఫీ తీసుకుంటుండగా కాలు జారీ 100 అడుగుల లోతులో ఉన్న లోయలో పడిపోయింది.

Also Read: కలవరపెడుతున్న రైలు ప్రమాదాలు.. ఒక్క నెలలోనే ఆరు ఘటనలు

సమాచారం తెలుసుకున్న హోంగార్టు, స్థానికులు లోయలోకి దిగి ఆమెను కాపాడారు. చికిత్స నిమిత్తం బాధితురాలిని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించామని.. ప్రస్తుతం ఆమె పరిస్థితి సీరియస్‌గా ఉందని అధికారులు తెలిపారు. భారీ వర్షాల వల్ల మట్టి జారుడగా ఉండటంతో ఇలాంటి ఘటనలు జరిగే అవకాశం ఉందని జిల్లా కలెక్టర్ జితేంద్ర దూడి తెలిపారు. జిల్లాలో పర్యాట ప్రాంతాలను శనివారం నుంచి సోమవారం వరకు మూసేవేయాలని ఆదేశాలు జారీ చేశారు. పర్యటక ప్రదేశాలకు వచ్చే యువతీ, యువకులు ప్రమాదకరమైన ప్రదేశాల వద్ద అప్రమత్తంగా ఉండాలని కోరారు.

Also Read: చిన్నారులపై పడిన గోడ..నలుగురు మృతి

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు