Shiv Sena Leader Argument With Auto Driver : ఓ రాజకీయ నేత కుమారుడు కారుకు ఆటో అడ్డు వచ్చిన విషయంలో ఆటో డ్రైవర్ తో వాగ్వాదానికి దిగాడు. అయితే అదే సమయంలో గుండె పోటు (Heart Attack) రావడంతో నిల్చున్న చోటే కుప్పకూలిపోయాడు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మహారాష్ట్ర (Maharashtra) లోని పాల్గఢ్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది.
పూర్తిగా చదవండి..Shiv Sena Leader : ఆటో డ్రైవర్ తో గొడవ.. గుండె ఆగి చనిపోయిన శివసేన నేత కుమారుడు!
ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని శివసేన (యూబీటీ)కి చెందిన రఘునాథ్ మోరే కుమారుడు మిలింద్ మోరే (45) ఆదివారం ఓ రిసార్ట్ నుంచి తిరిగి వస్తున్న క్రమంలో కారుకు ఆటో అడ్డుగా రావడంతో అతనితో వాగ్వాదానికి దిగాడు. ఆ సమయంలో మిలింద్ గుండెపోటుతో కుప్పకూలి చనిపోయాడు.
Translate this News: