Cockroach in Vande Bharat Express Food: రైళ్ళల్లో భోజనం ఏమీ అంత బావుండదు. ఈ విషయంలో చాలానే కంప్లైంట్స్ ఉన్నాయి. అయితే వందే భారత్ రైళ్ళల్లో నాణ్యమైన ఫుడ్ ఇస్తున్నామని...చాలా నీట్‌గా సప్లై చేస్తున్నామని చెబుతోంది రైల్వేశాఖ. మిగతా అన్ని ట్రైన్స్‌లో కూడా ఫుడ్ సదుపాయాలను మెరుగుపర్చామని అంది. కానీ ఎక్కడో ఒక చోట లోపాలు బయటపడుతూనే ఉన్నాయి.తాజాగా వందే భారత్ ట్రైన్‌లో పెట్టిన భోజనంలో బొద్దింక వచ్చిందంటూ ఒక వ్యక్తి కంప్లైంట్ చేశారు. మధ్యప్రదేశ్‌లోని (Madhya Pradesh) రాణికమలాపతి స్టైషన్ నుంచి జబల్‌పూర్ జంక్షన్‌కు వెళుతున్న సుభేందు కేసరి అనే వ్యక్తికి ఇచ్చిన ఫుడ్‌లో ఇది కనిపించింది. సుభేందు నాన్ వెజ్ ఫుడ్ (Non Veg Food) అర్డర్ చేశారు. అది వచ్చాక చూస్తే అందులో బొద్దింక కనిపించింది. దీంతో ఆయనకు కోపం వచ్చి...ట్రైన్ దిన తర్వాత రాత పూర్వకంగా రైల్వే డిపార్ట్‌మెంట్‌కు ఫిర్యాదు చేశారు. అంతేకాదు దాన్ని ఫోటో తీసి మరీ ఎక్స్‌లో పోస్ట్ చేశారు.
Also Read:Vande Bharat:మార్చి నుంచి వందే భారత్ స్లీపర్..మొదటి రైలు అక్కడి నుంచే..
స్పందించిన ఐఆర్సీటీసీ (IRCTC)...
దీనిపిఐ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ వెంటనే స్పందించింది. సుభేందుకు జరిగిన అసౌకర్యానికి విచారిస్తున్నామని...బాధ్యలు మీద వెంటనే చర్యలు తీసుకుంటామని చెప్పింది. ఆ మార్గంలో పర్యవేక్షణ మరింత కట్టుదిట్టం చేస్తామని హామీ ఇచ్చింది. ఫ్యూచర్‌లో ఇలాంటివి రిపీట్ కాకుండా చూసుకుంటామని చెప్పింది. అయితే ఇలాంటి అనుభవాలు ఇదే మొదటిది కాదు, కొత్తా కాదు. రీసెంట్‌గా ఢిల్లీ నుంచి వారణాసి వెళుతున్న ఓ ప్రయాణికుడికి ఇంచుమించుగా ఇలాంటి అనుభవమే జరిగింది. అతనికి ఇచ్చిన ఫుడ్ చాలా నాసిరకంగా ఉండడమే కాకుండా..వాసన కూడా వచ్చింది.
Sir, our sincere apology for the experience you had.The matter is viewed seriously, and the hefty penalty has been imposed on the concerned service provider. Moreover, monitoring has been strengthened at the source.
— IRCTC (@IRCTCofficial) February 3, 2024
ఎక్స్‌లో పోస్ట్...
ప్రయాణికులు తమ అనుభవాలను వెంటనే ఫోటోలు తీసి ఎక్స్‌లో పోస్ట్ట చేస్తున్నారు. సుభేందు కూడా బొద్దింక ఫోటోను తీసి తన ఖాతాలో పోస్ట్ చేశారు. దానికి భారగీ కూడా రెస్పాన్స్ కూడా వస్తోంది. ఇలాంటి ఫుడ్ పెడితే ప్రయాణాలు ఎలా చేస్తామంటూ నెటిజన్లు మండిపడుతున్నారు. అంతంత డబ్బులు తీసుకుని ఇలాంటి భోజనం పెడతారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇలాగే ఢిల్లీ నుంచి వారణాసి వెళ్థిన ప్రయాణికుడు కూడా తనకు వచ్చిన భోజనం పిక్ తీసి ఎక్స్‌లో పెట్టడమే కాకుండా రైల్వేశాఖ మంత్రి అశ్వనీ వైష్ణవ్ అధికారిక ఎక్స్ ఖాతాకు ట్యాగ్ కూడా చేశారు. భోజనం బాలేదు కాబట్టి తనకు తన డబ్బులు రిఫండ్ చేయాలని కోరారు. రైల్వే శాఖ అతని డబ్బులు మొత్తం తిరిగి ఇచ్చేసింది కూడా.