Rahul Gandhi: నామినేషన్ దాఖలు చేసిన రాహుల్ గాంధీ
లోక్ సభ ఎన్నికలు సిద్ధమయ్యారు రాహుల్ గాంధీ. ఈరోజు ప్రియాంక గాంధీతో కలిసి నామినేషన్ దాఖలు చేశారు రాహుల్. లోక్ సభ ఎన్నికల్లో వయనాడ్ నుంచి రాహుల్ గాంధీ పోటీ చేస్తున్న విషయం తెలిసిందే.
లోక్ సభ ఎన్నికలు సిద్ధమయ్యారు రాహుల్ గాంధీ. ఈరోజు ప్రియాంక గాంధీతో కలిసి నామినేషన్ దాఖలు చేశారు రాహుల్. లోక్ సభ ఎన్నికల్లో వయనాడ్ నుంచి రాహుల్ గాంధీ పోటీ చేస్తున్న విషయం తెలిసిందే.
ఇచ్చిన హామీలు అమలు చేయడంలో కాంగ్రెస్ విఫలమైందని అన్నారు హరీష్ రావు. రానున్న లోక్ సభ ఎన్నికల్లో 2 లక్షల రుణమాఫీ అయితే కాంగ్రెస్‌కు ఓటెయ్యండని... రుణమాఫీ కాకపోతే కారుకు ఓటు వెయ్యాలి అని పిలుపునిచ్చారు. బీజేపీ, కాంగ్రెస్ ఒకటే అని ఆరోపించారు.
లోక్ సభ ఎన్నికల వేళ బీజేపీ నేత, దుబ్బాక మాజీ ఎమ్మెల్యే రఘునందన్ రావుకు బీఆర్ఎస్ నేతలు షాక్ ఇచ్చారు. బీఆర్ఎస్ నేతలపై అనుచిత వ్యాఖ్యలు చేశారని ఫిర్యాదు చేశారు. కాగా పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.
ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై కాంగ్రెస్ నేతలు తనపై చేస్తున్న ఆరోపణలపై సీరియస్ అయ్యారు కేటీఆర్. ఈ క్రమంలో కేకే మహేందర్ రెడ్డి, యెన్నం శ్రీనివాస్‌రెడ్డితో పాటు మంత్రి కొండా సురేఖకు నోటీసులు పంపనున్నట్లు తెలిపారు. ఆధారాలు లేని ఆరోపణలు చేసిన నేతలు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
భారత ఆర్థిక వ్యవస్థ తీవ్ర సంక్షోభంలో ఉందని.. ఈ విషయాన్ని బీజేపీ పట్టించుకోవడం లేదని కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఆర్థిక మంత్రి పి. చిదంబరం అన్నారు. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు 31 శాతం ఎందుకు తగ్గాయని కేంద్రాన్ని ప్రశ్నించారు.
కాంగ్రెస్‌లో ఖమ్మం ఎంపీ టికెట్ వార్ కొనసాగుతోంది. పొంగులేటిపై సోషల్ మీడియాలో భట్టి అనుచరుల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మల్లు నందినికి టికెట్ రాకుండా మంత్రి పొంగులేటి అడ్డుపడుతున్నారని విమర్శలు గుప్పిస్తున్నారు. మల్లు నందిని రాజకీయ భవితవ్యంపై కుట్ర జరుగుతోందని మండిపడుతున్నారు.
TS: నేను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా.. రేవంత్ కూడా సీఎం పదవికి రాజీనామా చేసి మల్కాజ్గిరి నుంచి ఎంపీగా పోటీ చేయాలని కేటీఆర్ సవాల్ విసిరారు. మల్కాజ్గిరి ఎంపీగా ఉండి రేవంత్ ఒక్క పని చేయలేదని.. ఓటమి భయంతోనే తన సవాల్‌ను రేవంత్ స్వీకరించడం లేదని అన్నారు.
తెలంగాణలో మిగిలిన 8 పార్లమెంటు స్థానాలకు కాంగ్రెస్ హైకమాండ్ బధువారం అభ్యర్థుల్ని ఖరారు చేయనున్నట్లు సమాచారం. ఇందుకోసం ఆ పార్టీ కేంద్ర ఎన్నికల కమటీ (CEC) మరోసారి సమావేశం కానుంది. ఈరోజు లేదా రేపు అభ్యర్థుల జాబితాను విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది.
ఫోన్ ట్యాపింగ్ కేసులో ఓ ఎమ్మెల్సీ పాత్ర ఉందని విచారణలో తేలినట్లు తెలుస్తోంది. ఇజ్రాయిల్‌లో పరికరాలు కొని హైదరాబాద్ కు రప్పించడంలో ఓ ఎమ్మెల్సీ కీలక పాత్ర పోషించారని.. తన పలుకుబడి ఉపయోగించి రవిపాల్ తో ట్యాపింగ్ డివైజ్ లను తెప్పించినట్లు సిట్ అధికారులు గుర్తించినట్లు సమాచారం.