/rtv/media/post_attachments/wp-content/uploads/2024/04/ktr-3-jpg.webp)
MLA KTR: తెలంగాణలో సంచలనంగా మారిన ఫోన్ ట్యాపింగ్ కేసులో కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలపై కేటీఆర్ సీరియస్ అయ్యారు. తనపై ఆరోపణలు చేసిన కాంగ్రెస్ నేతలకు లీగల్ నోటీసులు పంపిస్తానని అన్నారు. సిరిసిల్ల కాంగ్రెస్ సీనియర్ నాయకులు కేకే మహేందర్ రెడ్డి, ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డితో పాటు మంత్రి కొండా సురేఖకు నోటీసులు పంపనున్నట్లు పేర్కొన్నారు. కాంగ్రెస్ నేతలపై పరువు నష్టం దావా వేయనున్నట్లు ట్వీట్ చేశారు. ఆధారాలు లేని ఆరోపణలు చేసిన నేతలు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ నేతలవి చెత్త ఆరోపణలు అని కేటీఆర్ కొట్టిపారేశారు.
Both these Congress fellows (including the minister) will be served legal notices for defamation & slander
Either Apologise for this shameful, baseless & nonsensical allegations or face legal consequences
Also will be serving legal notices to news outlets who are dishing out… pic.twitter.com/IjHNQ7Yn2T
— KTR (@KTRBRS) April 2, 2024