Nalgonda: ఉమ్మడి నల్లగొండ జిల్లాలో బర్డ్‌ఫ్లూ కలకలం
ఉమ్మడి నల్గొండలో బర్డ్ ఫ్లూ మరోసారి కలకలం రేపుతోంది. పలు పౌల్ట్రీఫామ్‌లలో కోళ్ళు మృతి చెందినట్లు అధికారులు పేర్కొన్నారు. ఆ పౌల్ట్రీఫామ్ గ్రామాల చుట్టుపక్కల ప్రాంతాలను రెడ్ జోన్‌గా ప్రకటించారు.
ఉమ్మడి నల్గొండలో బర్డ్ ఫ్లూ మరోసారి కలకలం రేపుతోంది. పలు పౌల్ట్రీఫామ్‌లలో కోళ్ళు మృతి చెందినట్లు అధికారులు పేర్కొన్నారు. ఆ పౌల్ట్రీఫామ్ గ్రామాల చుట్టుపక్కల ప్రాంతాలను రెడ్ జోన్‌గా ప్రకటించారు.
నంద్యాల లో వైసీపీకి నంద్యాల సుధాకర్ రెడ్డి (48) ని గుర్తుతెలియని వ్యక్తులు హత్య చేశారు. గత కొంతకాలంగా గ్రామంలో కొందరితో విభేధాలు ఉన్నాయని స్థానికులు తెలిపారు.పొలం నుంచి తిరిగి వస్తుండగా ఈ దారుణ ఘటన జరిగింది.
అమెరికా మరో విడతలోనూ భారీగా భారతీయులను పంపించేందుకు సిద్ధమైంది. త్వరలోనే 295 మంది అక్రమ వలసదారులను పంపించనున్నట్లు కేంద్రం తాజాగా వెల్లడించింది.
ఖమ్మం జిల్లాకి చెందిన సరోజనమ్మకి ఛాతీ నొప్పి రావడంతో ఓ ప్రైవేట్ హాస్పిటల్ లో స్టంట్ వేయించుకుంది.ఆపరేషన్ గది నుంచి రూమ్ కి లిఫ్ట్ లో తరలిస్తున్న సమయంలో లిఫ్ట్ పాడైపోవడంతో ఒక్కసారిగా కిందపడిపోయింది.దీంతో మహిళకు తీవ్ర గాయాలు కావడంతో చనిపోయింది.
కెనడా తో సంబంధాలపై భారత్ కీలక వ్యాఖ్యలు చేసింది. కెనడా మాజీ ప్రధాని జస్టిన్ ట్రూడో ఆధ్వర్యంలోనే తీవ్ర వాదులకు ,ఉగ్రవాదులకు లైసెన్సులు వచ్చాయి. దీంతో ఇరు దేశాల మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయని భారత విదేశాంగ మంత్రి రణధీర్ జైస్వాల్ అన్నారు.
ఏపీలో ఎండలతో అల్లాడిపోతున్న ప్రజలకు వాతావారణ శాఖ ఓ చల్లటి వార్త చెప్పింది. ఏపీలో నాలుగు రోజుల పాటూ పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని అధికారులు అంచనా వేస్తున్నారు.
తెలంగాణలో వాతావరణ పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది.హైదరాబాద్ సహా రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వర్షం కురిసింది. ముఖ్యంగా.. ఉమ్మడి కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో ఈదురు గాలులతో కూడిన వడగండ్లు కురిశాయి.
హయాత్ నగర్‌లోని లక్ష్మారెడ్డిపాలెం వద్ద తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో అడిషనల్ డీసీపీ బాబ్జీ మృతి చెందారు.ఆయన శనివారం ఉదయం లక్ష్మారెడ్డి పాలెం వద్ద వాకింగ్ చేస్తుండగా ఆర్టీసీ బస్సు వేగంగా ఢీకొట్టింది. దీంతో డీసీపీ స్పాట్ లోనే చనిపోయారు.