Wayanad Landslides: వాయనాడ్ లో మాటలకందని విషాదం.. 42కు పెరిగిన మృతుల సంఖ్య!
కేరళలోని వయనాడ్ జిల్లాలో మంగళవారం తెల్లవారుజామున భారీ కొండచరియలు విరిగిపడిన సంగతి తెలిసిందే. ఈ దుర్ఘటనలో ఇప్పటి వరకు కనీసం 42 మంది మృతి చెందినట్లు స్థానిక మీడియా కథనాలు తెలిపాయి. ఇంకా కొన్ని వేల మంది మట్టి దిబ్బల కింద చిక్కుకున్నట్లు అధికారులు అనుమానిస్తున్నారు.